News March 16, 2024
దేనికి సిద్ధం జగనన్న?: షర్మిల
AP: సిద్ధం సభలకు YCP రూ.600కోట్లు ఖర్చు పెట్టిందని APCC చీఫ్ షర్మిల ఆరోపించారు. విశాఖలో న్యాయసాధన సభలో ప్రసంగించిన ఆమె.. ‘ప్రత్యేక హోదాను, పోలవరాన్ని, వైజాగ్ స్టీల్‌ను కేంద్రం వద్ద తాకట్టు పెట్టడానికి సిద్ధమా? పూర్తి మద్యపాన నిషేధమని చెప్పి మహిళలను, 2.30లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని నిరుద్యోగులను మోసం చేయడానికి సిద్ధమా? దేనికి సిద్ధం జగనన్న? ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధం’ అని అన్నారు.
Similar News
News November 17, 2024
LeT సీఈవో అంటూ ఆర్బీఐకి బెదిరింపు కాల్
ముంబైలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు లష్కరే తోయిబా CEOను అంటూ ఓ వ్యక్తి బెదిరింపు కాల్ చేశాడు. శనివారం ఆర్బీఐ కస్టమర్ కేర్ నంబర్‌కు ఫోన్ చేసిన నిందితుడు ‘నేను లష్కరే తోయిబా సీఈవో. బ్యాక్ వే మూసేయండి. ఎలక్ట్రిక్ కారు చెడిపోయింది’ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే, ఇదో ఆకతాయి పనిలా పోలీసులు అనుమానిస్తున్నారు. RBI భద్రతా సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
News November 17, 2024
ఫోన్ వాడుతున్నాడని కొడుకుని చంపేసిన తండ్రి
ఫోన్ వ్యసనం ఓ బాలుడి ప్రాణం తీసింది. బెంగళూరుకు చెందిన రవికుమార్ కొడుకు తేజస్(14) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అతడు చదువుపై దృష్టి పెట్టకుండా అస్తమానం ఫోన్ చూసేవాడు. ఈక్రమంలోనే మొబైల్ పాడవడంతో రిపేర్ చేయించాలని తండ్రితో వాదనకు దిగాడు. దీంతో కోపోద్రిక్తుడైన రవి క్రికెట్ బ్యాట్‌తో అతడిని చితకబాదాడు. అంతటితో ఆగకుండా తేజస్ తలను బలంగా గోడకేసి బాదాడు. తీవ్రంగా గాయపడ్డ బాలుడు ప్రాణాలు విడిచాడు.
News November 17, 2024
మణిపుర్ సర్కారుకు మైతేయ్ గ్రూప్స్ అల్టిమేటం
సాయుధ మిలిటెంట్లపై చర్యలు తీసుకునేందుకు మణిపుర్ ప్రభుత్వానికి అక్కడి మైతేయ్ పౌర హక్కుల సంఘాలు 24 గంటలు టైమ్ ఇస్తూ అల్టిమేటం జారీ చేశాయి. శనివారం ఓ మూక రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ నివాసంలోకి వెళ్లేందుకు యత్నించిన సంగతి తెలిసిందే. ‘సాయుధ మూకలపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ప్రజల ఆగ్రహం ఎలా ఉంటుందో చూపిస్తాం’ అని మైతేయ్ సంఘాలు స్పష్టం చేశాయి. ప్రస్తుతం 5 జిల్లాల్లో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది.