News December 30, 2024
ఖైరతాబాద్: మాజీ ఎంపీని పరామర్శించిన మంత్రులు
నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథంని మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎమ్మెల్యే వివేక్‌లు సోమవారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మందా జగన్నాథంకి మంచి చికిత్స అందించాలని డాక్టర్ల బృందానికి మంత్రులు సూచించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
Similar News
News January 5, 2025
HYDలో IT శిక్షణకు అడ్డాగా అమీర్‌పేట
హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డిలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) సంబంధిత కోర్సుల శిక్షణకు అమీర్‌పేట అడ్డాగా మారింది. 1992 నుంచి ఇక్కడ ఐటీ శిక్షణ కొనసాగుతోంది. పైథాన్, డాట్ నెట్, డిజిటల్ మార్కెటింగ్, జావా, సీ ప్లస్, వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైన్ వంటి విభిన్న కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన ఎంతో మంది ఐటీ కొలువుల్లో రాణిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
News January 4, 2025
HYD: మంత్రులను, డీజీపీని కలిసిన హైడ్రా కమిషనర్
HYDలో మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, డీజీపీ జితేందర్‌ను హైడ్రా కమిషనర్ రంగనాథ్ కలిశారు. వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హైడ్రా తీసుకోబోయే చర్యలపై విస్తృతంగా చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. చట్టపరంగానే చెరువులు, ప్రభుత్వ భూములకు రక్షణ కల్పిస్తామన్నారు.
News January 4, 2025
HYD: 6,7 తేదీల్లో పరీక్ష.. అభ్యర్థులకు ALERT
HYD: ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్(సూపర్‌వైజర్) గ్రేడ్-1 ఖాళీల భర్తీకి ఈ నెల 6, 7 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు. ఈ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టీజీపీఎస్సీ https://www.tspsc.gov.in వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు ఉండనున్నాయి.