News March 16, 2024
MBNR : మోడీ సభ సక్సెస్.. బీజేపీ నేతల్లో జోష్

నాగర్ కర్నూల్ పట్టణ సమీపంలోని కొల్లాపూర్ చౌరస్తాలో ఈరోజు జరిగిన మోదీ విజయ సంకల్ప యాత్ర విజయవంతం కావడంతో బీజేపీ నేతల్లో ఉత్సాహం పెరిగింది. ఈ సందర్భంగా.. మోదీ మాట్లాడుతూ.. భరత్ ప్రసాద్ ను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. మోదీతోనే దేశాభివృద్ధి జరుగుతుందని డీకే అరుణ అన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డి, ఉమ్మడి పాలమూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు నాయకులు, నేతలు పాల్గొన్నారు.
Similar News
News August 17, 2025
పాలమూరు: ALERT.. దూరవిద్యకు రేపే లాస్ట్..!

ఈ ఏడాదికి గాను ఓపెన్ SSC, INTERలో చేరేందుకు దరఖాస్తుల గడువు రేపటితో ముగుస్తుందని ఉమ్మడి పాలమూరు జిల్లా ఓపెన్ స్కూల్ కో-ఆర్డినేటర్ శివయ్య Way2Newsతో తెలిపారు. ఈనెల 18లోగా (ఫైన్ లేకుండా) ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని, SSCకి 14 సం||లు, INTERకి 15 సం||ల కనీస వయసు ఉండాలన్నారు. అడ్మిషన్ అయిన వారికి ఉచిత పుస్తకాలు, తరగతులు నిర్వహిస్తామని, ఉమ్మడి జిల్లాలో SSC- 81, INTER- 107 సెంటర్లు ఉన్నాయన్నారు.
News August 17, 2025
ఉడిత్యాలలో అత్యధిక వర్షపాతం నమోదు

మహబూబ్నగర్ జిల్లాల్లో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా బాలానగర్ మండలం ఉడిత్యాలలో 36.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది. నవాబుపేట 33.5, మిడ్జిల్ 28.0, భూత్పూర్ 16.3, కోయిలకొండ మండలం పారుపల్లి 13.0, నవాబుపేట 12.8, మహబూబ్నగర్ అర్బన్ 10.8, హన్వాడ 10.0, రాజాపూర్ 8.3, మహమ్మదాబాద్ 8.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
News August 17, 2025
MBNR: 24 గంటల్లో నమోదైన వర్షపాతం

గడిచిన 24 గంటల్లో మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలో అత్యధికంగా మిడ్జిల్ మండలంలో 14.2 మి.మీ వర్షపాతం నమోదయింది. అత్యల్పంగా బాలానగర్ మండలంలో 0.3 మి.మీ వర్షపాతం కురిసింది. కౌకుంట్ల చిన్న చింతకుంట రాజాపూర్ మహమ్మదాబాద్ మండలాలలో ఎటువంటి వర్షపాతం నమోదు కాలేదు. నేడు రేపు కూడా జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.