News December 30, 2024

పాడేరు మెడికల్ కాలేజీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టులు భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హేమలతాదేవి తెలిపారు. పారామెడికల్, సపోర్టింగ్ స్టాఫ్ విభాగంలో 29 క్యాటగిరీలలో మొత్తం 244 పోస్టులు భర్తీ చేస్తామన్నారు. అభ్యర్థులు ఈనెల 31నుంచి జనవరి 10లోగా ప్రభుత్వ వైద్య కళాశాలలో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. >Share it

Similar News

News January 5, 2026

మహిళల భద్రతకు సఖి వాహనం: కలెక్టర్

image

మహిళల భద్రత, సాధికారత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన్ స్టాప్ సెంటర్ సఖి వాహనాన్ని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఎలాంటి భయాందోళన లేకుండా స్వేచ్ఛగా ప్రయాణించేందుకు, అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించేందుకు ఈ వాహనం ఉపయోగకరంగా ఉంటుందన్నారు. జిల్లాలో మహిళలు, బాలికల రక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

News January 5, 2026

కౌన్సిల్ ఆమోదం లేకుండా టెండర్లు: పీతల మూర్తి ఫిర్యాదు

image

జీవీఎంసీలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ముడసర్లోవ భూములపై రక్షణ ఏర్పాటు చేసి కబ్జాలు తొలగించాలని కమిషనర్ కేతన్ గార్గ్‌కు అందజేసిన వినతిపత్రంలో పేర్కొన్నారు. గుర్రాల పార్కు టెండర్ రద్దు చేయాలన్నారు. గత ప్రభుత్వం కౌన్సిల్ ఆమోదం లేకుండా ఆరు కోట్ల రూపాయలు టెండర్లు ఖరారు చేశారని ఆరోపించారు. ఇటీవల అధికారులు కూడా కౌన్సిల్‌కు తెలియకుండా చెల్లింపులు చేశారన్నారు.

News January 5, 2026

అధికారులకు విశాఖ కలెక్టర్ వార్నింగ్

image

విశాఖ కలెక్టరేట్లో సోమవారం జరిగిన రెవెన్యూ క్లినిక్‌లో కలెక్టర్ హరేందిర ప్రసాద్ పాల్గొన్నారు. భూములకు సంబంధించి వస్తున్న సమస్యలను వీలైనంతవరకు సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. భూ సమస్యల పరిష్కారంలో దళారులు, రాజకీయ నాయకులు చెప్పిన వారి నుండే అర్జీలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయని, అలా చేస్తే సస్పెండ్ చేస్తామన్నారు. భూసమస్యలు ఎక్కువ ఉన్న ప్రాంతాలలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.