News March 16, 2024
పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. ఏడుగురు జవాన్ల మృతి
పాకిస్థాన్‌లోని నార్త్ వజిరిస్థాన్ సెక్యూరిటీ చెక్‌పోస్టుపై ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు ఆర్మీ అధికారులతోపాటు ఆరుగురు టెర్రరిస్టులు మరణించారు. టెర్రరిస్టులు పేలుడు సామగ్రితో కూడిన వాహనంతో వచ్చి చెక్‌పోస్టును ఢీకొట్టి పేల్చేశారు. తర్వాత పారిపోయేందుకు ప్రయత్నించగా సైనికులు కాల్చేశారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Similar News
News November 22, 2024
సురేఖపై నాగార్జున దావా.. ఈనెల 28న తీర్పు
TG: మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం కేసులో ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. సురేఖ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్‌పై గురువారం ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ జరిగింది. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మంత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని నాగార్జున తరఫు లాయర్ డిమాండ్ చేశారు. వాదనల అనంతరం తీర్పును రిజర్వ్ చేసిన జడ్జి, ఈనెల 28న తీర్పును వెల్లడించనున్నట్లు తెలిపారు.
News November 22, 2024
BGT తొలి టెస్టు: అశ్విన్, జడేజా ఆడట్లేదా?
మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతున్న BGT తొలి టెస్టులో భారత్ బౌలింగ్ కాంబినేషన్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగే అవకాశముంది. అశ్విన్, జడేజాను కాదని సుందర్ వైపు టీమ్ మేనేజ్‌మెంట్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇటీవల NZ సిరీస్‌లో సుందర్ 2 మ్యాచుల్లో 16 వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. ఇక పేసర్లుగా బుమ్రా, సిరాజ్, రాణా, నితీశ్ ఆడనున్నట్లు తెలుస్తోంది.
News November 22, 2024
వాట్సాప్‌లో కొత్త ఫీచర్
వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్‌లకు ట్రాన్‌స్క్రిప్ట్‌లు (TEXT) అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. తొలుత కొన్ని సెలెక్టెడ్ లాంగ్వేజ్‌లలో మాత్రమే ఇది అందుబాటులో ఉంటుందని పేర్కొంది. వాయిస్ మెసేజ్ వినలేనప్పుడు, దాని ట్రాన్‌స్క్రిప్ట్‌లు చదివి మెసేజ్‌లో ఏముందో తెలుసుకోవచ్చని వివరించింది. ఈ ట్రాన్‌స్క్రిప్ట్‌లను వాట్సాప్ లేదా ఇతరులు చదివేందుకు వీలుండదని, సెక్యూర్డ్‌గా ఉంటాయని తెలిపింది.