News December 30, 2024
జనసేనలో చేరిన గంజి చిరంజీవి, జయమంగళం

AP: మంగళగిరి వైసీపీ నేత గంజి చిరంజీవి జనసేనలో చేరారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. గత ఎన్నికలకు ముందు ఈయన టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో అప్పటి నుంచి అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ జయమంగళం వెంకటరమణ (కైకలూరు) సైతం జనసేన తీర్థం పుచ్చుకున్నారు.
Similar News
News November 5, 2025
కార్తీక పౌర్ణమి.. వెలుగు జిలుగుల్లో కాశీ

దేశంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. కాశీ పుణ్యక్షేత్రం దీపాల వెలుగుల్లో మెరిసిపోయింది. గంగా నది ఒడ్డున కాశీ ఘాట్‌ను వేలాది విద్యుత్ లైట్లతో అలంకరించారు. ఇందుకు సంబంధించిన డ్రోన్ ఫొటోలు అబ్బురపరుస్తున్నాయి. ప్రధాని మోదీ ఈ ఫొటోలను Xలో షేర్ చేశారు.
News November 5, 2025
జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర దాడులకు కుట్ర?

జమ్మూకశ్మీర్‌లో దాడులకు లష్కరే తోయిబా, జైషే మహ్మద్ సంస్థలు ప్లాన్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. పాక్ SSG, ISI సాయంతో ఆయా సంస్థల టెర్రరిస్టులు దేశంలోకి చొరబడినట్లు అనుమానిస్తున్నాయి. టెర్రరిస్టు షంషేర్ ఆధ్వర్యంలోని టీమ్ డ్రోన్ల ద్వారా LoC గ్యాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చెక్ చేసిందని చెప్పాయి. క్రాస్ బార్డర్ అటాక్స్ చేసేందుకు పాక్ బార్డర్ యాక్షన్ టీమ్స్ సిద్ధంగా ఉన్నట్లు హెచ్చరించాయి.
News November 5, 2025
‘Money Heist’ ప్రేరణతో ₹150 కోట్ల దోపిడీ.. చివరికి..

థ్రిల్లర్ సిరీస్ ‘Money Heist’ ప్రేరణతో ₹150 కోట్లు దోచుకుంది ఢిల్లీకి చెందిన గ్యాంగ్. నిందితులు అర్పిత్(ప్రొఫెసర్), ప్రభాత్(అమాండా), అబ్బాస్(ఫ్రెడ్డీ) తమ పేర్లను సిరీస్‌లో మాదిరి మార్చుకున్నారు. SMలో పలు గ్రూపులు ఏర్పాటు చేసి స్టాక్ మార్కెట్ టిప్స్ ఇచ్చారు. తర్వాత హై రిటర్న్స్ ఇస్తామని నమ్మించి ₹కోట్లు వసూలు చేశారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు 2 రాష్ట్రాల్లో దాడులు చేసి వారిని పట్టుకున్నారు.


