News December 30, 2024
CRPF డీజీగా వితుల్ కుమార్
CRPF నూతన డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ వితుల్ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుత డీజీ అనీశ్ దయాల్ రేపు పదవీ విరమణ చేయనుండగా ఆ వెంటనే వితుల్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈయన 1993 బ్యాచ్ యూపీ క్యాడర్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం సీఆర్పీఎఫ్ స్పెషల్ డీజీగా పనిచేస్తున్నారు.
Similar News
News January 5, 2025
పాప్‌కార్న్ Vs మఖాన.. ఏది తింటే మంచిది?
పాప్‌కార్న్ కంటే మఖానాలో తక్కువ క్యాలరీలు, ఎక్కువ ప్రొటీన్ కంటెంట్ ఉంటుంది. ఫ్యాట్ కూడా తక్కువ మోతాదులో ఉండి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్ ఉండి ఎముకలు, కండరాలు దృఢంగా మారడానికి దోహదపడుతుంది. అయితే పాప్‌కార్న్‌లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉన్నా దాన్ని తయారుచేసే విధానాల వల్ల బటర్, ఆయిల్, సాల్ట్ కలిసి అందులోని న్యూట్రిషన్ ఉపయోగాలు శరీరానికి అందవు.
News January 5, 2025
అందుకే భూమి లేనివారికీ రూ.12వేలు: CM
TG: సాగు చేసేవారితో పాటు భూమి లేని వ్యవసాయ కుటుంబాలకూ రైతు భరోసా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. భూమి లేకపోవడం ఒక శాపమైతే, ప్రభుత్వం కూడా తమను ఆదుకోవడం లేదని పాదయాత్ర సమయంలో తన దృష్టికి వచ్చిందని సీఎం చెప్పారు. వారు కూడా సమాజంలో భాగమేనని గుర్తించి, ఏటా రూ.12వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు.
News January 5, 2025
ఇలాంటి వారు చపాతీలు తినకూడదా?
చపాతీలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ వీటిని కొందరు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలసట, ఆయాసంతో బాధపడేవారు తినకూడదు. వీటిలో ఉండే కార్బోహైడ్రేట్లను బర్న్ చేయడం వీరికి కష్టం. డయాబెటిస్ రోగులు కూడా వీటిని తీసుకోకపోవడం ఉత్తమం. అమిలో పెక్టిన్ అనే స్టార్చ్ మూలాలు రక్తంలో షుగర్ లెవెల్స్ పెంచుతాయి. అధిక బరువు, ఊబకాయం, థైరాయిడ్, జీర్ణ సమస్యలు ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలి.