News March 16, 2024

లెఫ్ట్ పార్టీలకు ఈ ఎన్నికలు చావోరేవో! – 1/2

image

ఎన్నికల నగారా మోగింది. బీజేపీ 400 సీట్లు టార్గెట్ పెట్టుకుంటే, ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ఇండియా కూటమిని ఏర్పాటు చేసుకుంది. ఇందులో భాగమైన లెఫ్ట్ పార్టీలకు మాత్రం ఈ ఎన్నికలు కత్తిమీద సాములా మారాయి. సీపీఐ-3, సీపీఎం-2తో గత ఎన్నికల్లో ఐదు సీట్లకే పరిమితమైన లెఫ్ట్ పార్టీల ఉనికి ఇప్పుడు అంతంతమాత్రంగానే ఉంది. ఈసారి తేడా వస్తే అది కూడా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందంటున్నారు విశ్లేషకులు.

Similar News

News November 24, 2024

రూ.12.50 కోట్లకు హేజిల్‌వుడ్‌ను సొంతం చేసుకున్న ఆర్సీబీ

image

ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ హేజిల్‌వుడ్‌ను ఆర్సీబీ కొనుగోలు చేసింది. బేస్ ప్రైజ్ రూ.2కోట్లతో వేలానికి వచ్చిన అతడిని రూ.12.50 కోట్లకు RCB దక్కించుకుంది. ఇతడి కోసం ముంబై, ఆర్సీబీ పోటీ పడ్డాయి. హేజిల్‌వుడ్ IPLలో 27 మ్యాచులు ఆడి 35 వికెట్లు తీసుకున్నారు.

News November 24, 2024

జితేశ్ శర్మ‌ను దక్కించుకున్న ఆర్సీబీ

image

రూ.కోటి బేస్ ప్రైజ్‌తో ఆక్షన్‌లోకి వచ్చిన జితేశ్ శర్మను RCB దక్కించుకుంది. రూ.11 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్లో ఇతను పంజాబ్ తరపున వికెట్ కీపింగ్ చేశాడు. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చే జితేశ్ శర్మ భారీ హిట్లు కొట్టగలరు. లీగ్ కెరీర్‌లో 40 మ్యాచులు ఆడి 151.14 స్ట్రైక్ రేట్‌తో 730 రన్స్ చేశారు.

News November 24, 2024

SRHకు ఇషాన్ కిషన్‌.. రూ.11.25 కోట్లు

image

వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను రూ.11.25 కోట్లకు SRH దక్కించుకుంది. రూ.2కోట్ల బేస్ ప్రైజ్‌తో కిషన్ వేలంలోకి రాగా ఢిల్లీ, పంజాబ్, కేకేఆర్, హైదరాబాద్ పోటీపడ్డాయి. ఇతను ఐపీఎల్ కెరీర్‌లో 105 మ్యాచులు ఆడి 2644 రన్స్ చేశారు. స్ట్రైక్ రేట్ 135.87గా ఉంది. ఆరంభం నుంచే భారీ షాట్లతో విరుచుకుపడటం ఇ’షాన్’ స్పెషాలిటీ.