News March 16, 2024
లోక్‌సభ పోలింగ్ తర్వాత J&K ఎన్నికలు: రాజీవ్‌కుమార్

జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై CEC రాజీవ్‌కుమార్ స్పందించారు. ‘లోక్‌సభ పోలింగ్ తర్వాత అక్కడ ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తాం. భద్రతా కారణాలతో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం కుదరదు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10-12 మంది చొప్పున.. మొత్తం వెయ్యి మందికిపైగా అభ్యర్థులు ఉంటారు. ప్రతి ఒక్కరికీ భద్రత అందించాలి. అందుకే ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించలేం’ అని ఆయన తెలిపారు.
Similar News
News August 28, 2025
TODAY HEADLINES

✷ తెలంగాణలో భారీ వర్షాలు, వరదలు.. పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
✷ వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మూసీ డెవలప్మెంట్: CM రేవంత్
✷ అర్హులెవరికీ అన్యాయం జరగదు: AP CM చంద్రబాబు
✷ APలో భారీ వర్షాలు.. నీటి ప్రాజెక్టులకు భారీగా వరద
✷ భారత్ మంచితనం.. పాక్‌లో 1.50 లక్షల మంది సేఫ్
✷ అమల్లోకి వచ్చిన 50% టారిఫ్స్
✷ IPLకు అశ్విన్ రిటైర్మెంట్
News August 28, 2025
అమెరికా టారిఫ్స్.. భారత్ ప్లాన్ ఇదే!

అమెరికా 50% టారిఫ్స్ అమల్లోకి రావడంతో భారత్ ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది. ఎగుమతులను 40 దేశాలకు విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. యూకే, సౌత్ కొరియా, జపాన్, ఆస్ట్రేలియా, యూరోపియన్ దేశాలకు డైమండ్స్, టెక్స్టైల్, లెదర్, సీ ఫుడ్ సహా ఇతర వస్తువులను ఎగుమతి చేయాలని భావిస్తోంది. భారత వస్తువుల క్వాలిటీ బాగుంటుందని, నమ్మకమైన ఎగుమతిదారు అని విదేశాల్లో విశ్వసనీయత ఉండటంతో దాన్ని వాడుకోవాలని యోచిస్తోంది.
News August 27, 2025
ఈ జిల్లాల్లో రేపు విద్యాసంస్థలకు సెలవు

TG: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు రేపు సెలవు ప్రకటించారు. కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు రేపు సెలవు ఉండనుంది. మిగతా జిల్లాల్లోనూ సెలవు ఇవ్వాలని తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుతున్నారు. మీ జిల్లాలో వర్షం పడుతోందా? కామెంట్ చేయండి.