News December 31, 2024

TODAY HEADLINES

image

☛ సత్య నాదెళ్లతో CM రేవంత్ భేటీ.. పెట్టుబడులపై చర్చ
☛ మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని TG అసెంబ్లీ తీర్మానం
☛ 2025లో BRS చీఫ్ ఎన్నిక: KTR
☛ ₹80,112crతో తెలుగు తల్లికి జలహారతి ప్రాజెక్టు: CM CBN
☛ APలో FEB 1 నుంచి రిజిస్ట్రేషన్ విలువలు పెంపు
☛ సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌ను ఒంటరి చేశారు: పవన్
☛ ఎయిడ్స్ టీకాకు USFDA ఆమోదం
☛ PSLV-C60 ప్రయోగం సక్సెస్
☛ BGT నాలుగో టెస్టులో INDపై AUS గెలుపు

Similar News

News January 20, 2026

NRPT: ‘కల్లు కింగ్‌’ లింగయ్య గౌడ్‌ కన్నుమూత

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ‘కల్లు కింగ్‌’గా పేరుగాంచిన గౌని లింగయ్య గౌడ్‌ మహరాజ్‌(102) సోమవారం అనారోగ్యంతో కన్నుమూశారు. 1975 నుంచి 2010 వరకు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో కల్లు సొసైటీలపై ఆయన ప్రత్యేక పట్టు సాధించారు. పాలమూరు గీత కార్మికుల సంక్షేమం కోసం కృషి చేసిన ఆయన అంత్యక్రియలు మంగళవారం స్వగ్రామంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News January 20, 2026

600 పోస్టులు.. అప్లై చేశారా?

image

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 600 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ అర్హత గలవారు JAN 25 వరకు NATS పోర్టల్‌లో అప్లై చేసుకోవాలి. వయసు 20 – 28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. అకడమిక్ మెరిట్, DV, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.12,300 చెల్లిస్తారు. వెబ్‌సైట్: bankofmaharashtra.bank.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News January 20, 2026

గ్రీన్‌లాండ్‌కు US యుద్ధ విమానం.. బలగాలను పెంచిన డెన్మార్క్

image

గ్రీన్‌లాండ్‌లోని పిటుఫిక్ స్పేస్ బేస్‌కు అమెరికా తన యుద్ధ విమానాన్ని పంపింది. నార్త్ అమెరికా రక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు NORAD తెలిపింది. మరోవైపు డెన్మార్క్ కూడా గ్రీన్‌లాండ్‌కు అదనపు సైన్యాన్ని, మిలిటరీ ఎక్విప్‌మెంట్‌ను తరలించింది. గ్రీన్‌లాండ్‌ను దక్కించుకోవాలని ట్రంప్ చూస్తున్న తరుణంలో ఇరు దేశాలు తమ మిలిటరీ పవర్‌ను పెంచడం ఉత్కంఠ రేపుతోంది.