News December 31, 2024

ధర్మపురి ఆలయ ఆదాయ వివరాలు రూ.62,01,156 

image

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం రూ.62,01,156 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాల టికెట్లు అమ్మకం ద్వారా రూ.62,720, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.43,380, అన్నదానం రూ.7,458, హుండీ లెక్కింపు ద్వారా రూ.60,87,598 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

Similar News

News September 14, 2025

కరీంనగర్ పీఏసీఎస్ లో 12.6 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ

image

కరీంనగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో శనివారం జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో 12.6 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేసినట్లు డిఏఓ తెలిపారు. రైతులు అవసరానికి మించి యూరియా వాడోద్దన్నారు. యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. జిల్లాకు అవసరమైన యూరియా తెప్పించి పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.

News September 14, 2025

KNR: సహకార సంఘాలకు పర్సన్ ఇన్ చార్జీల నియామకం

image

KNR జిల్లాలోని 30 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు పర్సన్ ఇన్ఛార్జీలను నియమిస్తూ జిల్లా సహకార అధికారి ఎస్.రామానుజాచార్య శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 30 సంఘాలకు గాను, 27 సంఘాలకు పాత PIC లనే కొనసాగిస్తూ, ఊటూర్, ఆర్నకొండ, గట్టుదుద్దెనపల్లి సంఘాల పదవీకాలాన్ని తిరిగి పొడిగించకుండా, వారిస్థానంలో సహకార శాఖ అధికారులను పర్సన్ ఇన్ చార్జీలను నియమించారు.

News September 14, 2025

కరీంనగర్: సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

image

సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్‌లో పోలీసులు కార్యక్రమం నిర్వహించారు. సైబర్ క్రైమ్ డీఎస్పీ కోత్వాల్ రమేష్ మాట్లాడుతూ, ఆధార్ కార్డు మోసాలు, ఏపీకే ఫైల్స్, సిమ్ కార్డుల దుర్వినియోగం, బ్యాంక్ ఖాతా సమాచారం, లింక్స్, పెట్టుబడుల మోసాలు, డిజిటల్ అరెస్ట్, సోషల్ మీడియా ఫ్రాడ్స్ వంటి నేరాలపై ప్రజలను అప్రమత్తం చేశామన్నారు.