News December 31, 2024
ఆ పిల్లల దత్తతును ఉపేక్షించం: కలెక్టర్ నాగారాణి

అనుమతిలేని పిల్లల దత్తతును ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, అలా జరిగితే సంబంధిత గ్రామ అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ చదలవాడ నాగరాణి హెచ్చరించారు. సోమవారం భీమవరం సమావేశ మందిరం వద్ద కలెక్టర్ అధ్యక్షతన మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి కార్యక్రమాల కన్వర్జెన్సీ సమావేశాన్ని సభ్యులైన సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శిశు సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 24, 2026
BREAKING: భీమవరంలో ACBకి చిక్కిన ఫారెస్ట్ అధికారి

భీమవరం పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో అవినీతి నిరోధక శాఖ(ACB) అధికారులు జరిపిన దాడులు కలకలం రేపాయి. భీమవరం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సురేశ్ రూ.4 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఒక పనికి సంబంధించి బాధితుడి నుంచి నగదు డిమాండ్ చేయడంతో అధికారులు నిఘా పెట్టి పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు, ఆయన నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు.
News February 24, 2026
పాలకొల్లు: మళ్లీ ‘ఫ్యాన్’ కిందకే మేకా.. సస్పెన్షన్ ఎత్తివేత?

మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు తిరిగి వైసీపీ గూటికి చేరనున్నారు. తాడేపల్లిలో పార్టీ అధినేత జగన్‌ని ఆయన తన కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి 9న జరగనున్న తన కుమారుడి వివాహానికి హాజరుకావాల్సిందిగా జగన్‌ను కోరగా, ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ భేటీ నేపథ్యంలో శేషుబాబుపై గతంలో ఉన్న సస్పెన్షన్‌ను అధిష్ఠానం ఎత్తివేసినట్లు తెలుస్తోంది.
News February 24, 2026
పీజీఆర్ఎస్‌కు 19 అర్జీలు: ఎస్పీ

భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం నిర్వహించిన ‘పీజీఆర్‌ఎస్’ కార్యక్రమంలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి 19 అర్జీలను స్వీకరించారు. వీటిలో ప్రధానంగా కుటుంబ కలహాలు, సైబర్ నేరాలు, భూ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అందిన ఫిర్యాదులపై త్వరితగతిన విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడబోమని స్పష్టం చేశారు.


