News December 31, 2024

ఆర్థిక పరమైనవి తప్ప మిగిలిన వాటికి పరిష్కారం చూపాలి: కలెక్టర్

image

ఆర్థికపరమైన, కోర్టు కేసులకు సంబంధించిన వినతులకు తప్ప మిగిలిన అన్ని వినతులకు సరైన పరిష్కారం చూపాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పీజీఆర్ఎస్ వినతులకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి వినతిని కూలంకుశంగా పరిశీలించాలన్నారు. ఈ సందర్భంగా 228 వినతులను కలెక్టర్ స్వీకరించారు.

Similar News

News January 5, 2025

గొడిసెలపల్లికి 16 ఏళ్ల తర్వాత ఆర్టీసీ బస్సు

image

డీ.హీరేహాళ్ మండలం గొడిసెలపల్లికి శనివారం RTC బస్సు వచ్చింది. ఇందులో విశేషమేముంది అనుకుంటున్నారా.. ఉంది. 16 ఏళ్లుగా ఆ ఊరికి RTC బస్సు సర్వీసు లేదు. కలెక్షన్స్ తగ్గాయని అప్పట్లో బస్సును రద్దు చేశారు. అప్పటి నుంచి ఆటోలు, బైకులపై గ్రామస్థులు ప్రయాణాలు సాగిస్తున్నారు. బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు పలుమార్లు వేడుకున్నారు. చివరికి రాయదుర్గం MLA శ్రీనివాసులు చొరవతో ఆర్టీసీ బస్సును ప్రారంభించారు.

News January 5, 2025

లింగ నిర్ధారణ నిషేధిత చట్టంపై కలెక్టర్ సమావేశం

image

అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో శనివారం అధికారులతో కలెక్టర్ వినోద్ కుమార్ సమావేశమయ్యారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అమలు పరిచే గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధిత చట్టం అమలుపై జిల్లాస్థాయి మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ మీటింగ్ నిర్వహించారు. లింగ నిర్ధారణ నిషేధిత చట్టం పక్కాగా అమలు కావాలన్నారు.

News January 4, 2025

ఈనెల 6 నుంచి దివ్యాంగుల పింఛన్ల సామాజిక తనిఖీ

image

అనంతపురం జిల్లాలో ఈ నెల 6 నుంచి ఎన్టీఆర్ దివ్యాంగుల పింఛన్లు సామాజిక తనిఖీలు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఒక కార్యక్రమంలో తెలిపారు. అన్ని మండలాలు, మున్సిపాలిటీలలో తనిఖీలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈనెల 6 నుంచి 10 వరకు తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. తనిఖీ సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు.