News March 16, 2024
సంగారెడ్డి: మార్చి 18 నుంచి 144 సెక్షన్

ఈ నెల 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగే పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తామని SP రూపేశ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సెంటర్‌లకు సమీపంలోని జిరాక్స్ కేంద్రాలు మూసి ఉంచాలని ఆదేశించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని సెంటర్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
Similar News
News August 17, 2025
మెదక్ జిల్లాలో వర్షపాతం అప్డేట్!

మెదక్ జిల్లాలో గత 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలో అత్యధికంగా టేక్మాల్ 14.8, అత్యల్పంగా తూప్రాన్‌లోని ఇస్లాంపూర్ 0.8 మిమీ వర్షపాతం రికార్డు అయింది. అటు చిప్పల్తుర్తి(నర్సాపూర్)13.3, బుజారంపేట్(కౌడిపల్లి), శివంపేట్10.0, నర్సాపూర్ 8.0, చిట్కుల్ (చిలప్ చెడ్), మనోహరాబాద్ 4.0, నాగపూర్ (హవేలి ఘనపూర్) 4.0 మిమీ వర్షపాతం నమోదైంది.
News August 17, 2025
MDK: వేడి చేసిన నీటినే తాగండి: ఈఈ

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు తాగునీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సీహెచ్.నాగభూషణం సూచించారు. మిషన్ భగీరథ గ్రిడ్ ద్వారా సరఫరా అవుతున్న నీరు శుద్ధి చేసి క్లోరినేషన్ అయినప్పటికీ, వర్షాల కారణంగా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని అన్నారు. ప్రతి ఒక్కరూ తాగునీటిని వేడి చేసి మాత్రమే తాగాలని ఆయన సూచించారు.
News August 16, 2025
మెదక్: రైతులకు డీఏవో దేవ్ కుమార్ సూచనలు

భారీ వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ సూచించారు. పంట పొలాల్లో నీరు నిలిచి ఉంటే కాలువల ద్వారా బయటకు పంపాలని సూచించారు. నాట్లు వేయని రైతులు వర్షాలు తగ్గిన తర్వాత నాట్లు వేసుకోవడానికి సిద్ధం కావాలని కోరారు. సమయం తక్కువగా ఉంటే వెదజల్లే పద్ధతిలో విత్తనాలు వేసుకోవచ్చని సూచించారు. అలాగే, కలుపు నివారణ చర్యలు తీసుకోవాలని రైతులకు తెలిపారు.