News December 31, 2024

స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌పై కేసు కొట్టివేత

image

TG: స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై 2019లో నమోదైన కేసును హైకోర్టు తాజాగా కొట్టివేసింది. ఆ ఏడాది ఎన్నికల నియమావళి అమలులో ఉన్న సమయంలో వికారాబాద్ ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆయన చేసిన దీక్ష నియమాల ఉల్లంఘన కిందికే వస్తుందని పేర్కొంటూ అప్పట్లో ఆయనపై కేసు నమోదైంది. దానిపై ప్రసాద్ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా విచారణ జరిపిన ధర్మాసనం, కేసును కొట్టివేస్తున్నట్లు తీర్పునిచ్చింది.

Similar News

News January 5, 2025

పడిపోతున్న టెంపరేచర్.. వణికిస్తున్న చలి

image

తెలంగాణలో చలి వణికిస్తోంది. 15 జిల్లాల్లో 10 డిగ్రీలలోపే టెంపరేచర్ నమోదవుతోంది. నిన్న అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గడిచిన తొమ్మిదేళ్లలో ఇక్కడ ఇదే కనిష్ఠ ఉష్ణోగ్రత కావడం గమనార్హం. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో 6.1, ఆదిలాబాద్ జిల్లా అర్లిలో 6.2, కామారెడ్డి జిల్లా డోంగ్లి, రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో 6.8 చొప్పున టెంపరేచర్ నమోదైంది.

News January 5, 2025

విద్యార్థుల కోసం ట్రాఫిక్ అవేర్‌నెస్ పార్కులు

image

TG: విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 500 ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో ట్రాఫిక్ అవేర్‌నెస్ పార్కులు ఏర్పాటు చేయనుంది. తొలి దశలో ఒక్కో నియోజకవర్గంలో ఒక పార్కును ప్రయోగాత్మకంగా నిర్మించనుంది. అందుకు కంపెనీలు వెచ్చించే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్‌ను ఉపయోగించనుంది.

News January 5, 2025

మా కులాల పేర్లు మార్చండి మహాప్రభో!

image

TG: చులకనభావంగా చూస్తూ తిట్లకు ఉపయోగిస్తున్న తమ కులాల పేర్లు మార్చాలని బీసీ కమిషన్‌కు పలు సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ఇందులో దొమ్మర, పిచ్చకుంట్ల, తమ్మలి, బుడబుక్కల, కుమ్మర, చాకలి, చిప్పోలు, వీరముష్టి కులాలున్నాయి. వీటి స్థానంలో వేరే పేర్లను సూచించడంతో బీసీ కమిషన్ వాటిని పరిగణనలోకి తీసుకొని నోటిఫికేషన్ జారీ చేసింది. మార్చిన పేర్లపైనా ఏమైనా అభ్యంతరాలుంటే ఈనెల 18 లోపు చెప్పాలని పేర్కొంది.