News December 31, 2024

ఇస్రోకి చంద్రబాబు అభినందనలు

image

PSLV-60 రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రోకు AP CM చంద్రబాబు ట్విటర్లో అభినందనలు తెలిపారు. ‘మరో మైలురాయిని దాటిన ఇస్రోకు అభినందనలు. ఆర్బిటల్ డాకింగ్‌లో భారత సామర్థ్యాన్ని మరింత పెంచేలా స్పేడెక్స్ ప్రయోగం విజయవంతమైంది. మనుషుల రోదసి ప్రయాణానికి, ఉపగ్రహాలు మరమ్మతులకు ఇది చాలా కీలకం. ఈ విజయంతో చంద్రయాన్-4, స్పేస్ స్టేషన్ వంటి కీలక లక్ష్యాలకు భారత్ మరింత చేరువైంది’ అని పేర్కొన్నారు.

Similar News

News January 5, 2025

కాఫీ, టీ తాగేవారికి గుడ్ న్యూస్!

image

కాఫీ, టీ తాగేవారిలో ఇతరుల కంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ తెలిపింది. రోజుకు 4కప్పుల కాఫీ తాగేవారిలో 17% క్యాన్సర్ కారకాలు తగ్గాయని చెప్పింది. నోటి క్యాన్సర్ లక్షణాలు 30%, గొంతు క్యాన్సర్ కారకాలు 22% తక్కువైనట్లు వివరించింది. అలాగే, రోజుకు ఒక్క కప్పైనా టీ తాగేవారిలో 9% తల, మెడ క్యాన్సర్ కారకాలు తక్కువగా ఉన్నాయని స్పష్టం చేసింది. అయితే అదే పనిగా టీ తాగకూడదంది.

News January 5, 2025

శబరిమలకు పోటెత్తిన భక్తులు

image

శబరిమలకు అయ్యప్ప భక్తులు పోటెత్తారు. గడిచిన 24 గంటల్లో లక్ష మందికి పైగా దర్శనం చేసుకున్నట్లు దేవస్థానం తెలిపింది. రద్దీ పెరగడంతో అయ్యప్పస్వామి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. స్పాట్ దర్శనానికి 20 వేల టికెట్లను ట్రస్ట్ జారీ చేసింది. పంబ నుంచి సన్నిధానం వరకు అయ్యప్ప భక్తులు భారీగా క్యూలైన్లలో వేచి ఉన్నారు. త్వరలో శబరిమలలో మకర జ్యోతి దర్శనం ఉండటంతో రానున్న రోజుల్లో భక్తుల తాకిడి పెరగనుంది.

News January 5, 2025

ఎన్టీఆర్ మూవీలో హీరోయిన్ ఫిక్స్?

image

ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ ‘డ్రాగన్‌’(ప్రచారంలో ఉన్న పేరు)కి హీరోయిన్‌ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. రుక్మిణీ వసంత్‌‌ను ఎంపిక చేసినట్లు సినీవర్గాలు చర్చించుకుంటున్నాయి. విదేశాల్లో న్యూఇయర్ సెలబ్రేషన్స్ పూర్తి చేసుకొని హైదరాబాద్ చేరుకున్న NTR ఈ మూవీ కోసం నెలాఖరున కర్ణాటక వెళ్తారని తెలుస్తోంది. అటు హృతిక్ రోషన్‌తో ఎన్టీఆర్ నటించిన వార్-2 ఆగస్టులో రిలీజ్ కానుంది.