News December 31, 2024
పుట్టిన రోజున వారసుడిని ప్రకటించనున్న దలైలామా?
ఆధ్యాత్మిక గురువు దలైలామా జూలై 6న 90వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన వారసుడిని ప్రకటిస్తారన్న ప్రచారం నడుస్తోంది. చైనాపై నిరసన తెలిపేందుకు ఆ ప్రకటన ఆయనకున్న అవకాశమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా.. దలైలామా తర్వాతి స్థానంలో ఉండే పాంచెన్ లామాను చైనా ఇప్పటికే ఖైదు చేసింది. వారసుడిని ప్రకటనకు వారిద్దరూ ఉండాల్సిన అవసరం ఉండటంతో లామా ఏం చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Similar News
News January 5, 2025
స్కూళ్లకు సంక్రాంతి సెలవులు.. ఎప్పుడంటే?
తెలంగాణలోని స్కూళ్లకు సంక్రాంతి సెలవులు తగ్గిస్తారనే ప్రచారం జరుగుతోంది. వాస్తవంగా అకడమిక్ క్యాలెండర్‌లో జనవరి 13 నుంచి 17 వరకు సెలవులు ఇచ్చారు. జనవరి 11న రెండో శనివారం, 12న ఆదివారం కావడంతో వరుసగా 7 రోజులు వచ్చే అవకాశం ఉంది. సెలవులపై కొంత గందరగోళం నెలకొనడంతో త్వరలోనే సెలవులపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. అటు ఏపీలో జనవరి 10 నుంచి 19 వరకు సెలవులు ఇవ్వనున్నారు.
News January 5, 2025
రేపు అకౌంట్లలో డబ్బులు జమ
AP: ఐదో తేదీ వచ్చినా జీతాలు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఉపశమనం కలిగించే న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీచర్లకు రేపు అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నట్లు తెలిపింది. కాగా ఇప్పటికే ఇతర ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు అందాయి. మరోవైపు పింఛన్లను కూడా డిసెంబర్ 31నే ప్రభుత్వం పంపిణీ చేసిన విషయం తెలిసిందే.
News January 5, 2025
అప్పులకు సిద్ధమవుతున్న రాష్ట్రాలు
జనవరి-మార్చి త్రైమాసికంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు రూ.4.73 లక్షల కోట్ల అప్పులు తీసుకోనున్నాయి. ఇందులో ఏపీ రూ.11వేల కోట్లు, తెలంగాణ రూ.30వేల కోట్ల అప్పులు చేయనున్నాయి. ప్రభుత్వాలతో ఇటీవల సంప్రదింపుల అనంతరం RBI ఈ వివరాలను ప్రకటించింది. జనవరిలో రూ.1.47 లక్షల కోట్లు, ఫిబ్రవరిలో రూ.1.51 లక్షల కోట్లు, మార్చిలో రూ.1.74 లక్షల కోట్ల రుణాలను సమీకరించనున్నాయి.