News December 31, 2024
హత్య కేసులో నిందితునికి జీవిత ఖైదు: ఎస్పీ
గంట్యాడ పోలీసు స్టేషనులో 2023 సంవత్సరంలో నమోదైన హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు, రూ.2,500 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పిందని ఎస్పీ వకుల్ జిందల్ సోమవారం తెలిపారు. గంట్యాడ మండలం తాడిపూడికి చెందిన పదాల సత్యనారాయణ భార్యతో గొడవలు కారణంగా మామ అప్పలస్వామిని కత్తితో పొడిచి చంపడంతో కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టగా, నేరం రుజువు కావడంతో పై విధంగా శిక్ష ఖరారైందని చెప్పారు.
Similar News
News January 5, 2025
VZM: హైందవ శంఖారావానికి తరలి వెళ్లిన ఉమ్మడి జిల్లా వాసులు
విజయవాడలోని కేసరపల్లిలో హైందవ శంఖారావం నినాదంతో భారీ బహిరంగ సభ ఆదివారం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మహాసభకు ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన పలువురు భక్తులు, హిందూ సంఘాల సభ్యులు విజయవాడకు శనివారం పయనమయ్యారు. విజయనగరం, పార్వతీపురం జిల్లా కేంద్రాల నుంచి ప్రైవేట్ బస్సుల్లో తరలి వెళ్తున్నారు. మరి కొంతమంది ట్రైన్లను ఆశ్రయించారు.
News January 4, 2025
VZM: కానిస్టేబుల్ ఉద్యోగాలు.. 236 మంది గైర్హాజరు..!
విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో మహిళ కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది . మొత్తం 550 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 314 మంది అభ్యర్థులు మాత్రమే PMT, PET పరీక్షలకు హాజరయ్యారు. 236 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. కాగా ఎంపిక ప్రక్రియ శుక్రవారం ఉదయం 5గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు జరిగింది.
News January 4, 2025
మార్చి 8న జాతీయ లోక్ అదాలత్: జిల్లా జడ్జి
మార్చి 8న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి పిలుపునిచ్చారు. శుక్రవారం తన ఛాంబర్ లోని పలు ప్రైవేట్ చిట్ ఫండ్ ఫైనాన్స్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఫైనాన్స్ కంపెనీకి చెందిన కేసులన్నీ లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవాలని సూచించారు. ఎక్కువ కేసులు రాజీ చేసుకునే ప్రయత్నం చేయాలన్నారు.