News December 31, 2024
చైనా మాపై సైబర్ దాడి చేసింది: అమెరికా
చైనా తమపై సైబర్ దాడికి పాల్పడిందని అమెరికా ట్రెజరీ శాఖ చట్టసభకు రాతపూర్వకంగా తెలిపింది. ఈ నెల మొదటివారంలో తమ వర్క్ స్టేషన్లను, కొన్ని డాక్యుమెంట్లను సైబర్ నేరగాళ్లు యాక్సెస్ చేశారని పేర్కొంది. ‘మా సైబర్ భద్రత నిపుణులతో సంప్రదించి పరిస్థితిని చక్కదిద్దాం. దుండగులకు యాక్సెస్‌ను కట్ చేయగలిగాం. ఆధారాల్ని బట్టి ఈ పని చేసింది చైనా ప్రభుత్వ మద్దతున్న సైబర్ హ్యాకింగ్ బృందమే’ అని స్పష్టం చేసింది.
Similar News
News January 5, 2025
4 లక్షల పాస్‌పోర్టుల జారీనే లక్ష్యం
AP:పాస్‌పోర్టుల జారీని మరింత వేగంగా, ఎక్కువ సంఖ్యలో ఇచ్చే సామర్థ్యాన్ని పెంచుకున్నట్లు విజయవాడ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయ అధికారి శివ హర్ష తెలిపారు. 2024-25లో 3.23 లక్షల పాస్‌పోర్టులు అందించామని, 2025-26లో 4 లక్షల పాస్‌పోర్టులను జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. VJY, TPTY పాస్‌పోర్టు సేవా కేంద్రాలు, 13 పోస్టాఫీస్ సేవా కేంద్రాల్లో రోజుకు 1800 అపాయింట్‌మెంట్స్ ఇస్తున్నామన్నారు.
News January 5, 2025
WTC ఫైనల్ ఆశలు గల్లంతు.. IND ఇంటిముఖం
BGT సిరీస్ కోల్పోవడంతో భారత్ WTC ఫైనల్ ఆశలు గల్లంతయ్యాయి. చివరి టెస్టులో ఘోర ఓటమితో ఫైనల్ రేసు నుంచి తప్పుకున్న భారత్ ఇంటిముఖం పట్టింది. మొదటి టెస్ట్ గెలుపుతో మరోసారి ఫైనల్ చేరి టెస్ట్ గద సొంతం చేసుకుంటుదని భావించారంతా. ఆ తర్వాత టాప్‌ఆర్డర్ బ్యాటర్ల వైఫల్యం, బుమ్రా మినహా బౌలర్లు రాణించకపోవడంతో భారత్ సిరీస్ కోల్పోయింది. అటు, WTC ఫైనల్ చేరిన ఆసీస్ లార్డ్స్‌లో సౌతాఫ్రికాతో జూన్ 11న తలపడనుంది.
News January 5, 2025
నలుగురు నక్సల్స్ హతం
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ రీజియన్‌లో నక్సల్స్, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు నక్సల్స్ హతం కాగా, డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్ హెడ్ కానిస్టేబుల్ మృతిచెందారు. శనివారం సాయంత్రం నారాయణపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దులో కాల్పులు ప్రారంభమయ్యాయి. రాత్రి సమయంలో నాలుగు నక్సల్స్ మృతదేహాలను గుర్తించిన పోలీసులు AK-47తో సహా పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.