News December 31, 2024
బీఎల్వోలకు త్వరలో గౌరవ వేతనాలు
AP: రాష్ట్రంలోని 4,638మంది బూత్ లెవల్ ఆఫీసర్ల(BLO)కు త్వరలో గౌరవ వేతనాలు అందనున్నాయి. 2021-22 నుంచి వేతనాలందక 26 జిల్లాల్లోని BLOలు ఇబ్బంది పడుతున్నట్లు రాష్ట్ర లోకాయుక్తకు ఫిర్యాదు అందింది. దీనిపై స్పందించాలని SEPలో ఉన్నతాధికారులను లోకాయుక్త ఆదేశించింది. విచారణ జరిపిన అధికారులు రూ.58.62కోట్లు విడుదల చేయాలని జిల్లా ట్రెజరీ అధికారులను తాజాగా ఆదేశించారు. దీంతో త్వరలో BLOలకు వేతనాలు అందనున్నాయి.
Similar News
News January 5, 2025
కేజీ చికెన్ ధర ఎంతంటే?
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి ముందు చికెన్ రేట్లలో స్వల్పంగా మార్పులు చేసుకున్నాయి. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో విత్ స్కిన్ రూ.180-200, స్కిన్ లెస్ రూ.210-230 మధ్య అమ్ముతున్నారు. HYDలో ధరలు రూ.200, రూ.220గా ఉన్నాయి. మరోవైపు ఏపీలో కేజీ స్కిన్ లెస్ చికెన్ రూ.190-230 మధ్య అమ్ముతున్నారు. మీ ప్రాంతంలో చికెన్ ధర ఎంత ఉందో కామెంట్ చేయండి.
News January 5, 2025
జనవరి 15న పరీక్షలు రద్దు
TG: ఈ నెల 15న కనుమ పండుగ రోజున జరగాల్సిన ఇంజినీరింగ్ సెమిస్టర్ పరీక్షలను JNTU రద్దు చేసింది. పండుగ రోజున పరీక్ష నిర్వహించడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో 15న జరగాల్సిన పరీక్షను రద్దు చేస్తూ, 30వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో యూనివర్సిటీ నిర్ణయంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News January 5, 2025
BREAKING: భారత్ ఓటమి
సిడ్నీ టెస్టులో భారత్‌పై 6 వికెట్ల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. దీంతో 3-1 తేడాతో BGT సిరీస్‌ను కంగారూలు కైవసం చేసుకున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో 141/6తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ మరో 16 పరుగులు మాత్రమే జోడించి ఆలౌటైంది. 162 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వెన్నునొప్పితో బాధపడుతున్న బుమ్రా బౌలింగ్‌కు రాలేదు.