News December 31, 2024

సీఎం రేవంత్ ఆస్తి ఎంతంటే…

image

TG: దేశంలో సంపన్న ముఖ్యమంత్రుల్లో సీఎం రేవంత్ ఏడో స్థానంలో నిలిచారు. ఆయన పేరిట రూ.30.04 కోట్ల విలువైన ఆస్తులున్నాయని ఏడీఆర్ నివేదిక తెలిపింది. ఇక రూ.931 కోట్లతో ఏపీ సీఎం చంద్రబాబు అగ్రస్థానంలో, రూ.332 కోట్లతో అరుణాచల్ సీఎం పెమాఖండు రెండో స్థానంలో నిలిచారు. కేవలం రూ.15 లక్షల ఆస్తితో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ జాబితాలో ఆఖరి స్థానంలో ఉన్నారు.

Similar News

News January 5, 2025

క్లీంకారను అప్పుడే చూపిస్తా: రామ్‌చరణ్

image

మెగా ప్రిన్సెస్ క్లీంకార పూర్తి ఫొటోను రామ్‌చరణ్-ఉపాసన దంపతులు ఇంతవరకు బయటపెట్టలేదు. దీనిపై అన్‌స్టాపబుల్ షోలో ‘ఎప్పుడు బయటపెడతారు’ చరణ్‌ను బాలకృష్ణ ప్రశ్నించారు. ‘ఏ రోజైతే నన్ను నాన్న అని పిలుస్తుందో ఆ రోజు రివీల్ చేస్తా. చాలా సన్నగా ఉంటుంది. తినాలంటే ఇల్లంతా తిరుగుతుంది’ అని చెర్రీ బదులిచ్చారు. అలాగే ఉపాసన, పవన్ కళ్యాణ్, ప్రభాస్‌ల గురించి పలు ప్రశ్నలను చరణ్‌కు బాలయ్య సంధించారు.

News January 5, 2025

బన్నీకి పోలీసుల నోటీసులు.. ఫ్యాన్స్ అసంతృప్తి

image

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో బాధితులను పరామర్శించలేదని సీఎం రేవంత్‌తో సహా పలువురు అల్లు‌అర్జున్‌ను విమర్శించిన విషయం తెలిసిందే. కాగా, ఇవాళ బన్నీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను కలిసేందుకు వెళ్తున్నారన్న సమాచారంతో వెళ్లొద్దని పోలీసులు నోటీసులిచ్చారు. దీనిపై బన్నీ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. తమ హీరో పట్ల అప్పుడు ఒకలా, ఇప్పుడు మరోలా వ్యవహరించడం సరికాదంటున్నారు. దీనిపై మీ COMMENT.

News January 5, 2025

బుమ్రా హెల్త్‌పై గంభీర్ ఏమన్నారంటే?

image

ఐదో టెస్టు చివరి ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయకపోవడంతో బుమ్రా ఆరోగ్యంపై ఫ్యాన్స్‌లో ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. కాగా, అతను మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నారని, వాళ్లే త్వరలో హెల్త్ అప్‌డేట్ ఇస్తారని చెప్పారు. చివరి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన బుమ్రా, బౌలింగ్‌‌ చేయలేదు. జస్ప్రీత్ వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు ప్రసిద్ధ్ కృష్ణ నిన్న మీడియాతో అన్నారు. కాగా ఈ సిరీస్‌లో బుమ్రా 32 వికెట్లు తీశాడు.