News December 31, 2024

ముక్కోటి ఏకాదశిలో.. రామయ్య దశావతారాలు

image

భద్రాచలం ఆలయంలో ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు నేటి నుంచి 2025 JAN 20 వరకు అంగరంగావైభవంగా జరుగనున్నాయి. అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. రామయ్య తన దశావతారాలలో భక్తులకు ప్రత్యేక దర్శనమిస్తారు. DEC 31న మత్స్యావతారం, JAN 1న కూర్మావతారం, 2న వరాహావతారం, 3న నరసింహావతారం, 4న వామనావతారం, 5న పరశురామావతారం, 6న శ్రీరామావతారం,7న బలరామావతారం, 8న శ్రీకృష్ణావతారం, 9న తెప్పోత్సవం,10న ఉత్తర ద్వార దర్శనమిస్తారు.

Similar News

News January 5, 2025

ఉమ్మడి ఖమ్మం జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు
∆} కొత్తగూడెం పట్టణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} బూర్గం పహాడ్ మండలంలో ఎమ్మెల్యే పాయం పర్యటన
∆} అశ్వరావుపేటలో ఎమ్మెల్యే జారే పర్యటన
∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} భద్రాచలంలో ఎమ్మెల్యే వెంకట్రావు పర్యటన

News January 5, 2025

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెరిగిన చలి తీవ్రత

image

ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో చలి తీవ్రత ఆదివారం ఒక్కసారిగా పెరిగింది. ఖమ్మం జిల్లాలో 17, భద్రాద్రి జిల్లాలో 16 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అటు పలు ప్రాంతాల్లో పొగ మంచు దట్టంగా కమ్ముకోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అటు ఉదయాన్నే పనికి వెళ్లే రోజువారీ కూలీలు చలి తీవ్రత కారణంగా వణుకుతూ పయనమయ్యారు. రాబోయే రోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

News January 5, 2025

స్థానిక పోరుకు సన్నద్ధం…

image

ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా గ్రామపంచాయతీ ఎన్నికలా? ప్రాదేశిక ఎన్నికలా? అనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. కాగా ఇప్పటికే ఎన్నికల కమిషన్ నుంచి ఎన్నికల సామగ్రిని జిల్లాలకు పంపించే ప్రక్రియ ప్రారంభమైంది. మరోవైపు ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా ఏ ఎన్నికలు ముందుగా వస్తాయనే విషయంపై గ్రామాల్లో చర్చ జోరుగా జరుగుతోంది.