News December 31, 2024
టీచర్‌గా మారిన ఎమ్మెల్యే బండారు శ్రావణి

అనంతపురం జిల్లా గార్లదిన్నె మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌ను శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ సోమవారం తనిఖీ చేశారు. అనంతరం కాసేపు టీచర్‌గా మారి విద్యార్థులను ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. పాఠశాలలోని సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. క్రమశిక్షణతో చదువుకోవాలని, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాల సిబ్బందకి పలు సూచనలు చేశారు.
Similar News
News May 7, 2025
ATP: క్లైమ్ సెటిల్మెంట్, రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం

అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ మీటింగ్ హాల్లో జిల్లా స్థాయి క్లైమ్ సెటిల్మెంట్ కమిటీ, రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాన్ని సంబంధిత జిల్లా అధికారులతో కలెక్టర్ వినోద్ కుమార్ నిర్వహించారు. శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎస్పీ జగదీష్ పాల్గొన్నారు. రోడ్ సేఫ్టీపై వాహనదారులకు, ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
News May 7, 2025
మలేరియా అవగాహన ర్యాలీని ప్రారంభించిన DMHO

”మలేరియా అంత మనతోనే” అనే నినాదంతో ఈ ఏడాది ప్రపంచ మలేరియా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి దేవి పేర్కొన్నారు. అనంతపురంలోని DMHO కార్యాలయంలో మలేరియాపై అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. వైద్య ఆరోగ్య సిబ్బంది పరస్పర సహకారంతో ప్రజలలో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నట్లు వివరించారు.
News April 25, 2025
మలేరియా అంతం మనతోనే: DMHO దేవి

ఏప్రిల్ 25 ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా, DMHO కార్యాలయంలో జిల్లా వైద్యాధికారిణి దేవి మలేరియా అంతం మనతోనే’ అనే గోడపత్రికను ఆవిష్కరించారు. వైద్య ఆరోగ్య సిబ్బంది& మునిసిపల్, గ్రామ పంచాయతీ సిబ్బంది పరస్పర సహకారంతో DMHO గురువారం అవగాహన నిర్వహించారు. మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధి నుంచి రక్షణ కల్పించాలని తెలిపారు.