News December 31, 2024
నెఫ్ట్, ఆర్టీజీఎస్ లావాదేవీలపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం
చెల్లింపుల భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు RBI కీలక నిర్ణయం తీసుకుంది. RTGS, NEFT, ఆన్‌లైన్ లావాదేవీలు జరిపే వినియోగదారులకు వారు డబ్బులు పంపే బ్యాంకు ఖాతాదారుడి పేరు కనిపించేలా చూడాలని భారత జాతీయ చెల్లింపుల కార్పొరేషన్(NPCI)ని ఆదేశించింది. తద్వారా మోసాలు, తప్పులు జరగకుండా వినియోగదారులు జాగ్రత్త పడతారని పేర్కొంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1లోపు ఇది అమలుకావాలని బ్యాంకులకు RBI తేల్చిచెప్పింది.
Similar News
News January 5, 2025
తమిళనాడు సీఎం కావాలన్నదే నా కోరిక: త్రిష
రెండు దశాబ్దాలుగా సినీ రంగంలో రాణిస్తున్న హీరోయిన్ త్రిష కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి కావాలన్నదే తన కోరిక అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సామాజిక సమస్యలపై పోరాటంతో పాటు ప్రజా సేవ చేయాలని ఉందంటూ రాజకీయాలపై తన ఆసక్తిని బయటపెట్టారు. ఈమె వ్యాఖ్యలు సినీ, రాజకీయ రంగాల్లో చర్చనీయాంశంగా మారాయి. తమిళనాట సినీ స్టార్లు ఎంజీఆర్, జయలలిత సీఎంలుగా పనిచేసిన విషయం తెలిసిందే.
News January 5, 2025
కుంభమేళాకు 13 వేల రైళ్లు
Jan 13 నుంచి ప్రారంభంకానున్న కుంభమేళాకు 13 వేల రైళ్లను నడపనున్నట్టు అధికారులు తెలిపారు. పుష్కర కాలానికోసారి జరిగే ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి 40 కోట్ల మంది భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. దేశ, విదేశాల నుంచి వచ్చేవారి సౌలభ్యం కోసం 10K జనరల్ రైళ్లతో పాటు 3K ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. కుంభమేళా ప్రారంభానికి ముందు NDRF బృందాలు మాక్‌డ్రిల్ నిర్వహించాయి.
News January 5, 2025
ఓడినా.. చాలా పాజిటివ్ అంశాలున్నాయి: గంభీర్
ఆశించిన మేర రాణించకపోవడంతోనే BGT కోల్పోయామని కోచ్ గంభీర్ అన్నారు. మెరుగైన ప్రదర్శనకు బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో వర్కౌట్ చేయాల్సి ఉందని చెప్పారు. ఈ సిరీస్‌లో చాలా పాజిటివ్ అంశాలున్నాయన్నారు. AUSపై తొలి పర్యటనలోనే నితీశ్, ఆకాశ్, జైస్వాల్, ప్రసిద్ధ్ రాణించారని చెప్పారు. సిరాజ్ మంచి ప్రదర్శన చేశారని కొనియాడారు. భారత్ 5నెలల తర్వాత తిరిగి టెస్టులు ఆడనుందని, అప్పటికి అన్నీ సెట్ అవుతాయని చెప్పారు.