News December 31, 2024
మా పెళ్లి విషయం జ్యోతికి తెలుసు: కానిస్టేబుల్ వసంత
<<15019443>>నల్గొండ టాస్క్ ఫోర్స్లో SIగా <<>>పని చేస్తున్నమహేందర్ను తాను రెండవ వివాహం చేసుకున్న విషయం ఆయన మొదటి భార్య జ్యోతితో పాటు కుటుంబ సభ్యులకు తెలుసని కానిస్టేబుల్ వసంత తెలిపారు. జ్యోతి మొదట గొడవపడినా తనకి పిల్లలు లేకపోవడంతో తర్వాత ఒప్పుకుందన్నారు. జ్యోతికి పిల్లలు పుట్టడంతో ఇప్పుడు తమను బద్నాం చేస్తుందన్నారు. కాగా నిన్న మహేందర్ మొదటి భార్య కారుణ్య మరణానికి అనుమతివ్వాలని కలెక్టరేట్ ముందు నిరసన చేసిన విషయం తెలిసిందే.
Similar News
News January 5, 2025
కేసీఆర్తో నల్గొండ జిల్లా నేతల భేటీ
ఉమ్మడి NLG జిల్లాకు చెందిన నేతలతో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కే. చంద్రశేఖర రావు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వం పై పోరాడేందుకు తొందర ఏం లేదని.. వేచి చూద్దామని పేర్కొన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ను కలిసిన వారిలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు పలువురు మాజీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు పాల్గొన్నారు.
News January 5, 2025
NLG: స్థానిక పోరుకు సన్నద్ధం…
NLG జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా గ్రామపంచాయతీ ఎన్నికలా? ప్రాదేశిక ఎన్నికలా? అనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. కాగా ఇప్పటికే ఎన్నికల కమిషన్ నుంచి ఎన్నికల సామగ్రిని జిల్లాలకు పంపించే ప్రక్రియ ప్రారంభమైంది. మరోవైపు ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా ఏ ఎన్నికలు ముందుగా వస్తాయనే విషయంపై గ్రామాల్లో చర్చ జోరుగా జరుగుతోంది.
News January 5, 2025
మానవ వ్యాధుల నివారణలో ఔషధ మొక్కల పాత్ర కీలకం
మానవ వ్యాధుల నివారణలో ఔషధ మొక్కల పాత్ర కీలకమని కాకతీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు ఆచార్య ముస్తఫా అన్నారు. శనివారం మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఔషధ మొక్కలపై నిర్వహించిన అతిథి ఉపన్యాస కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. వృక్షాల వర్గీకరణ, ఔషధ మొక్కలు, వృక్షజాతుల గుర్తింపు , ముఖ్యంగా వ్యాధుల నివారణలో మొక్కల యొక్క పాత్రను విద్యార్థులకు వివరించారు.