News December 31, 2024
కురబలకోటలో రోడ్డుప్రమాదం.. మదనపల్లె వాసి మృతి
కురబలకోట ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును బైకు ఢీ కొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, ఓ మహిళ తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. మృతుడు మదనపల్లె కనకదాస్ నగర్‌కు చెందిన నేతన్న శివ(25)గా గుర్తించారు. మహిళను మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో డాక్టర్లు ఆమెను రుయాకు రెఫర్ చేశారన్నారు.
Similar News
News January 5, 2025
వరదయ్యపాలెం: కరెంట్ బిల్లు రూ.47 వేలు
వరదయ్యపాలెం మండలం కోవూరుపాడుకు చెందిన మారెయ్య తన ఇంటికి వచ్చిన కరెంటు బిల్లు చూసి కంగుతిన్నాడు. జనవరి నెలలో కరెంట్ బిల్లు రూ.47,932 రావడంతో నోరు వెల్లబెట్టాడు. గత నెలలో రూ. 830 బిల్లు వచ్చినట్లు తెలిపారు. ప్రతినెలా క్రమం తప్పకుండా బిల్లు చెల్లిస్తున్నట్లు చెప్పారు. దీంతో బాధితుడు వరదయ్యపాలెం విద్యుత్ శాఖ కార్యాలయ అధికారులను ఆశ్రయించాడు.
News January 5, 2025
కుప్పం: రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య
చెన్నై-బెంగళూరు రైల్వే మార్గంలోని కుప్పం మండలం గుల్లెపల్లి సమీపంలో శనివారం గుర్తు తెలియని యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి వివరాలు ఎవరికైనా తెలిస్తే కుప్పం రైల్వే పోలీసులను సంప్రదించాలని పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
News January 5, 2025
అధికారులు సమన్వయంతో పని చేయాలి: టీటీడీ ఛైర్మన్
తిరుమల ఔటర్ రింగ్ రోడ్డు, కృష్ణతేజ రెస్ట్ హౌస్‌లోని క్యూ లైన్లు, పార్కింగ్ ప్రాంతాలను టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్.నాయుడు శనివారం పరిశీలించారు. అనంతరం అన్నమయ్య భవన్లో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ, పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైకుంఠ ద్వార దర్శనం కల్పించే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని కోరారు.