News December 31, 2024

పేపర్ లీక్ చేసిన వ్యక్తి ఉమ్మడి తూ.గో. వాసే

image

పదో తరగతి SA-1 పరీక్షల్లో లెక్కల పేపర్ లీక్‌కు కారణమైన ఉమ్మడి తూ.గో.(D) రామచంద్రపురం మండల విద్యాశాఖాధారితోపాటు టీచర్‌ సుబ్బారావును విజయవాడ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని కోర్టులో సోమవారం హాజరుపరచగా రిమాండ్ విధించారు. మండలంలోని హైస్కూల్‌లో ఓ విద్యార్థికి ప్రశ్నపత్రాన్ని ఆయన ఇవ్వగా.. బాలిక టెలిగ్రామ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేసింది. వెంటనే ఓ యూట్యూబ్ ఛానల్‌లో ప్రత్యక్షమవడంతో విషయం తెలిసింది.

Similar News

News March 6, 2026

మార్చి 7న రాజమండ్రిలో జాబ్ మేళా: కలెక్టర్

image

మార్చి 7వ తేదీన రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఉన్న వికాస కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో టీటెన్త్, ఇంటర్, డిగ్రీ, ITI, డిప్లొమా, బీటెక్, M.B.A ఉత్తీర్ణులై 35 ఏళ్లలోపు వయస్సు గల అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News March 5, 2026

పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రాజమండ్రికి తరలింపు

image

పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ(PPA) కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి తరలించాలని కేంద్ర జలశక్తి శాఖ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్ట్ పర్యవేక్షణను సమర్దవంతంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో వేగవంతమైన పర్యవేక్షణ, కార్యాలయం దగ్గరగా ఉండటం వల్ల పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించడం సులభమవుతుంది. ముంపు సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి నేరుగా తీసుకెళ్లవచ్చు.