News December 31, 2024
బొకేలు వద్దు.. పుస్తకాలు, పెన్నులతో రండి: పత్తికొండ ఎమ్మెల్యే
న్యూ ఇయర్ వేళ పత్తికొండ ఎమ్మెల్యే శ్యాం బాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. తనను కలిసేందుకు వచ్చే కార్యకర్తలు, నాయకులు బొకేలు, పూలదండలు, శాలువాలతో రావొద్దని సూచించారు. విద్యార్థులకు ఉపయోగపడే నోట్ పుస్తకాలు, పెన్నులు, ఎగ్జామ్ ప్యాడ్స్, పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడే మొక్కలు తీసుకురావాలని సూచించారు. జిల్లా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సైతం తన అభిమానులకు ఇలాంటి పిలుపే ఇచ్చారు.
Similar News
News January 5, 2025
నందికొట్కూరులో వైరల్ అవుతున్న నో పార్కింగ్ బోర్డు
నందికొట్కూరులోని ఓ మందుల దుకాణం ముందు ఏర్పాటు చేసిన ‘నో పార్కింగ్ బోర్డు’ వైరల్‌గా మారింది. ‘దుకాణాల ముందు వాహనాలు నిలుపరాదు’ అంటూ నో పార్కింగ్ బోర్డులు ఏర్పాటు చేయడం చూశాం. అయితే ఓ దుకాణం యజమాని చెప్పు గుర్తుతో బోర్డు ఏర్పాటు చేశాడు. ‘వాహనాలు నిలిపితే చెప్పుతో కొడతా’ అని అర్థం వచ్చేలా ఆ బోర్డు ఉంది.
News January 5, 2025
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల లబ్ధి: కలెక్టర్
రాష్ట్ర ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని, అర్హత గల ప్రతి ఒక్కరికీ సంక్షేమ లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ జీ.రాజకుమారి అన్నారు. శనివారం నంద్యాల కలెక్టరేట్లో లూయిస్ బ్రెయిలీ 217వ జయంతి సందర్భంగా అంతర్జాతీయ ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత లూయిస్ బ్రెయిలీ చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి జ్యోతి వెలిగించి ప్రారంభించారు.
News January 5, 2025
సీఎస్ కర్నూలుకు రావడం గర్వకారణం: కలెక్టర్
కర్నూలుకు రావాలని ఆహ్వానించగానే చీఫ్ సెక్రటరీ విజయానంద్ జిల్లాలో పర్యటించడంపై కలెక్టర్ పీ.రంజిత్ బాషా హర్షం వ్యక్తం చేశారు. బీ.క్యాంపులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని సీఎస్ ప్రారంభించడం గర్వకారణమన్నారు. కర్నూలు జిల్లాలోనే అత్యధిక విద్యార్థులు ఈ కళాశాలలో చదువుతున్నట్లు సీఎస్‌కు వివరించారు. ఇంటర్ విద్యార్థులకు ఈ పథకం అమలు హర్షణీయమని కలెక్టర్ కొనియాడారు.