News December 31, 2024
విమానంలో ఏ సీటు సేఫ్?
ఇటీవల తరచూ విమాన ప్రమాదాలు జరుగుతుండటంతో ఫ్లైట్స్‌లో ఏ సీట్లు సేఫ్ అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రెక్కల కిందిభాగంలో ఇంధనం ఉండటం వల్ల నిప్పులు రాజుకుంటే వాటి పక్కన కూర్చున్న వారికి ప్రభావం ఎక్కువని, తోక భాగం సేఫ్ అని నిపుణులు అంటున్నారు. మంటలు లేకపోయినా ముందు కూర్చున్నవారికి ముప్పు ఎక్కువట. మధ్య సీట్ల పరిస్థితి విచిత్రమని, నిప్పు లేకపోతే EMG ఎగ్జిట్ వీరికి దగ్గరగా ఉండటంతో తప్పించుకునే అవకాశముంది.
Similar News
News January 5, 2025
రేపటి నుంచి OP, EHS సేవలు బంద్
AP: రేపటి నుంచి NTR వైద్యసేవ నెట్వర్క్ ఆస్పత్రుల్లో OP, EHS సేవలు నిలిపేస్తున్నట్లు ఏపీ నెట్వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ తెలిపింది. రూ.3వేల కోట్ల ప్రభుత్వ బకాయిలతో ఆస్పత్రుల నిర్వహణ కష్టతరమైందని చెప్పింది. ప్రభుత్వం మీద గౌరవంతో కేవలం 2 సేవలే నిలిపేస్తున్నట్లు పేర్కొంది. 25 వరకూ ప్రభుత్వానికి సమయం ఇస్తున్నట్లు, అప్పటికి రూ.1500cr బకాయిలు విడుదల చేయకపోతే సేవలు పూర్తిగా నిలిపేస్తామని హెచ్చరించింది.
News January 5, 2025
క్లీంకారను అప్పుడే చూపిస్తా: రామ్‌చరణ్
మెగా ప్రిన్సెస్ క్లీంకార పూర్తి ఫొటోను రామ్‌చరణ్-ఉపాసన దంపతులు ఇంతవరకు బయటపెట్టలేదు. దీనిపై అన్‌స్టాపబుల్ షోలో ‘ఎప్పుడు బయటపెడతారు’ చరణ్‌ను బాలకృష్ణ ప్రశ్నించారు. ‘ఏ రోజైతే నన్ను నాన్న అని పిలుస్తుందో ఆ రోజు రివీల్ చేస్తా. చాలా సన్నగా ఉంటుంది. తినాలంటే ఇల్లంతా తిరుగుతుంది’ అని చెర్రీ బదులిచ్చారు. అలాగే ఉపాసన, పవన్ కళ్యాణ్, ప్రభాస్‌ల గురించి పలు ప్రశ్నలను చరణ్‌కు బాలయ్య సంధించారు.
News January 5, 2025
బన్నీకి పోలీసుల నోటీసులు.. ఫ్యాన్స్ అసంతృప్తి
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో బాధితులను పరామర్శించలేదని సీఎం రేవంత్‌తో సహా పలువురు అల్లుఅర్జున్ను విమర్శించిన విషయం తెలిసిందే. కాగా, ఇవాళ బన్నీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను కలిసేందుకు వెళ్తున్నారన్న సమాచారంతో వెళ్లొద్దని పోలీసులు నోటీసులిచ్చారు. దీనిపై బన్నీ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. తమ హీరో పట్ల అప్పుడు ఒకలా, ఇప్పుడు మరోలా వ్యవహరించడం సరికాదంటున్నారు. దీనిపై మీ COMMENT.