News December 31, 2024
RJDలకు కీలక ఆదేశాలు
AP: స్కూళ్లు, విద్యాశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఆప్కాస్ సిబ్బందితో పాటు పెన్షనర్ల వివరాలను నమోదు చేయాలని RJDలను విద్యాశాఖ ఆదేశించింది. హౌస్ హోల్డ్ డేటాబేస్‌లో పలువురి వివరాలు నమోదు కాకపోవడంతో ఈ చర్యలు చేపట్టారు. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తూ డేటా బేస్‌లో పేర్లు లేని ఉద్యోగులు 2.80 లక్షల మంది ఉండగా, ఒక్క విద్యాశాఖలోనే 63వేల మందికి పైగా ఉన్నారు.
Similar News
News January 6, 2025
ఆంధ్ర పేపర్ మిల్లు లాకౌట్
AP: రాజమండ్రిలోని ఇంటర్నేషనల్ ఆంధ్ర పేపర్ మిల్లు యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. మిల్లు మూతబడటంతో కార్మికులు ఆందోళనకు దిగారు. వేతన సవరణ చేయాలని కార్మికులు ఈ నెల 2నుంచి సమ్మె చేస్తుండగా యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. ఈ నిర్ణయంపై నిరసన వ్యక్తం చేసిన కార్మికులు, తమ కుటుంబాలు రోడ్డున పడతాయని వాపోయారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మిల్లు వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు.
News January 6, 2025
‘కన్నప్ప’లో కాజల్.. ఫస్ట్ లుక్ విడుదల
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కన్నప్ప’ సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ఇందులో హీరోయిన్ కాజల్ పార్వతీ దేవిగా కనిపించనున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ 2025, ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. ఈ మూవీకి ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.
News January 6, 2025
GOOD NEWS: వారంలో జాబ్ క్యాలెండర్?
AP: రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 12న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లు, కొత్తవి కలిపి దాదాపు 3వేల పోస్టుల భర్తీ జరగనుంది. గ్రూప్-1 పోస్టులతో పాటు వివిధ శాఖల్లో ఖాళీలను నింపనున్నారు. అటు వర్సిటీలు, RGUKTల్లోని 3వేల పోస్టులకు నోటిఫికేషన్లు రానున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రకటించిన మెగా DSC(16,347 పోస్టులు) నోటిఫికేషన్ కూడా త్వరలోనే విడుదల కానున్నట్లు తెలుస్తోంది.