News December 31, 2024

ఈ రంగాల్లో.. 10 లక్షల ఉద్యోగాలు

image

క్వాంటమ్ కంప్యూటింగ్, జెనరేటివ్ AI టెక్నాలజీలు నేర్చుకున్న వారికి మంచి భవిష్యత్ ఉంటుందని క్వెస్ ఐటీ సాఫ్టింగ్ సంస్థ వెల్లడించింది. 2030 కల్లా 10 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేసింది. AI, మెషీన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీలు ఎన్నో మార్పులు తెస్తున్నాయంది. టెక్ ఉద్యోగాల కల్పనలో బెంగళూరు టాప్‌లో, HYD, పుణే ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయంది.

Similar News

News January 5, 2025

ఢిల్లీ గ్యారంటీల‌ను రెడీ చేస్తున్న కాంగ్రెస్‌

image

దేశ‌వ్యాప్తంగా ప్ర‌తి ఎన్నిక‌లో ప‌లు హామీల‌ను గ్యారంటీల పేరుతో ప్ర‌క‌టిస్తున్న కాంగ్రెస్ తాజాగా ఢిల్లీ ఎన్నిక‌ల‌పై దృష్టిసారించింది. Febలో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌ కోసం సోమవారం నుంచి పలు దశల్లో గ్యారంటీల‌ను ప్ర‌క‌టించ‌నుంది. ఢిల్లీలో మ‌హిళ‌ల‌కు ఆప్ ప్ర‌క‌టించిన ₹2,100 సాయం కంటే అధికంగా కాంగ్రెస్ హామీ ఇచ్చే అవ‌కాశం ఉంది. ఆరోగ్య బీమా, ఉచిత రేష‌న్, విద్యుత్‌ హామీల‌పై క‌స‌ర‌త్తు తుదిద‌శ‌కు చేరుకుంది.

News January 5, 2025

రేపటి నుంచి OP, EHS సేవలు బంద్

image

AP: రేపటి నుంచి NTR వైద్యసేవ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో OP, EHS సేవలు నిలిపేస్తున్నట్లు ఏపీ నెట్‌వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ తెలిపింది. రూ.3వేల కోట్ల ప్రభుత్వ బకాయిలతో ఆస్పత్రుల నిర్వహణ కష్టతరమైందని చెప్పింది. ప్రభుత్వం మీద గౌరవంతో కేవలం 2 సేవలే నిలిపేస్తున్నట్లు పేర్కొంది. 25 వరకూ ప్రభుత్వానికి సమయం ఇస్తున్నట్లు, అప్పటికి రూ.1500cr బకాయిలు విడుదల చేయకపోతే సేవలు పూర్తిగా నిలిపేస్తామని హెచ్చరించింది.

News January 5, 2025

క్లీంకారను అప్పుడే చూపిస్తా: రామ్‌చరణ్

image

మెగా ప్రిన్సెస్ క్లీంకార పూర్తి ఫొటోను రామ్‌చరణ్-ఉపాసన దంపతులు ఇంతవరకు బయటపెట్టలేదు. దీనిపై అన్‌స్టాపబుల్ షోలో ‘ఎప్పుడు బయటపెడతారు’ చరణ్‌ను బాలకృష్ణ ప్రశ్నించారు. ‘ఏ రోజైతే నన్ను నాన్న అని పిలుస్తుందో ఆ రోజు రివీల్ చేస్తా. చాలా సన్నగా ఉంటుంది. తినాలంటే ఇల్లంతా తిరుగుతుంది’ అని చెర్రీ బదులిచ్చారు. అలాగే ఉపాసన, పవన్ కళ్యాణ్, ప్రభాస్‌ల గురించి పలు ప్రశ్నలను చరణ్‌కు బాలయ్య సంధించారు.