News December 31, 2024

2024.. ఇక సెలవు

image

ఎన్నో ఆశలు, ఆశయాలతో మనం స్వాగతం పలికిన 2024 మరికొన్ని గంటల్లో మనల్ని విడిచి వెళ్లిపోనుంది. 366(లీప్ ఇయర్) రోజులుగా మనతోనే ఉంటూ, కొందరికి తీపి జ్ఞాపకాలను, మరికొందరికి చేదు గుళికలను మిగిల్చింది. బుల్లెట్ కంటే స్పీడ్‌గా, రాకెట్ కంటే వేగంగా 2024 అప్పుడే అయిపోయిందా? అనేలా మనందరికీ సైన్ ఆఫ్ చెప్పేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది మీకు ఎలాంటి మెమొరీస్ అందించిందో కామెంట్ చేయండి. GOOD BYE 2024

Similar News

News January 5, 2025

ఢిల్లీ గ్యారంటీల‌ను రెడీ చేస్తున్న కాంగ్రెస్‌

image

దేశ‌వ్యాప్తంగా ప్ర‌తి ఎన్నిక‌లో ప‌లు హామీల‌ను గ్యారంటీల పేరుతో ప్ర‌క‌టిస్తున్న కాంగ్రెస్ తాజాగా ఢిల్లీ ఎన్నిక‌ల‌పై దృష్టిసారించింది. Febలో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌ కోసం సోమవారం నుంచి పలు దశల్లో గ్యారంటీల‌ను ప్ర‌క‌టించ‌నుంది. ఢిల్లీలో మ‌హిళ‌ల‌కు ఆప్ ప్ర‌క‌టించిన ₹2,100 సాయం కంటే అధికంగా కాంగ్రెస్ హామీ ఇచ్చే అవ‌కాశం ఉంది. ఆరోగ్య బీమా, ఉచిత రేష‌న్, విద్యుత్‌ హామీల‌పై క‌స‌ర‌త్తు తుదిద‌శ‌కు చేరుకుంది.

News January 5, 2025

రేపటి నుంచి OP, EHS సేవలు బంద్

image

AP: రేపటి నుంచి NTR వైద్యసేవ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో OP, EHS సేవలు నిలిపేస్తున్నట్లు ఏపీ నెట్‌వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ తెలిపింది. రూ.3వేల కోట్ల ప్రభుత్వ బకాయిలతో ఆస్పత్రుల నిర్వహణ కష్టతరమైందని చెప్పింది. ప్రభుత్వం మీద గౌరవంతో కేవలం 2 సేవలే నిలిపేస్తున్నట్లు పేర్కొంది. 25 వరకూ ప్రభుత్వానికి సమయం ఇస్తున్నట్లు, అప్పటికి రూ.1500cr బకాయిలు విడుదల చేయకపోతే సేవలు పూర్తిగా నిలిపేస్తామని హెచ్చరించింది.

News January 5, 2025

క్లీంకారను అప్పుడే చూపిస్తా: రామ్‌చరణ్

image

మెగా ప్రిన్సెస్ క్లీంకార పూర్తి ఫొటోను రామ్‌చరణ్-ఉపాసన దంపతులు ఇంతవరకు బయటపెట్టలేదు. దీనిపై అన్‌స్టాపబుల్ షోలో ‘ఎప్పుడు బయటపెడతారు’ చరణ్‌ను బాలకృష్ణ ప్రశ్నించారు. ‘ఏ రోజైతే నన్ను నాన్న అని పిలుస్తుందో ఆ రోజు రివీల్ చేస్తా. చాలా సన్నగా ఉంటుంది. తినాలంటే ఇల్లంతా తిరుగుతుంది’ అని చెర్రీ బదులిచ్చారు. అలాగే ఉపాసన, పవన్ కళ్యాణ్, ప్రభాస్‌ల గురించి పలు ప్రశ్నలను చరణ్‌కు బాలయ్య సంధించారు.