News December 31, 2024

డిజిటల్ మోసాల్లో వారే అధికం: సజ్జనార్

image

వృద్ధులు సైబర్ మోసాల బారిన పడటానికి ఓ రకంగా వారి పిల్లలే కారణమని టీజీఆర్టీసీ MD సజ్జనార్ ట్వీట్ చేశారు. వృద్ధాప్యంలో వారిని సరిగా పట్టించుకోకపోవడం సైబర్ నేరగాళ్లకు అనుకూలంగా మారుతోందని తెలిపారు. సైబర్ నేరాల బాధితుల్లో వీరి సంఖ్యే ఎక్కువని పేర్కొన్నారు. వారి కదలికలపై పిల్లలు నిఘా పెట్టాలని సూచించారు. HYDలో వృద్ధుడైన ఓ విశ్రాంత ఉద్యోగి నుంచి రూ.9.50లక్షలను కేటుగాళ్లు కాజేసిన వార్తను ఆయన షేర్ చేశారు.

Similar News

News November 6, 2025

రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఉచిత వైద్యం: పొన్నం

image

TG: కేంద్రం ప్రవేశ పెట్టిన పథకంతో రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారికి రూ.లక్షన్నర వరకు ఫ్రీ వైద్యం అందిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రోడ్డు భద్రతా చర్యలపై ఓ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, మృతుల సంఖ్య అధికంగా ఉండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు విద్యా సంస్థల్లో రోడ్ సేఫ్టీ, రూల్స్‌పై వ్యాసరచన పోటీలు నిర్వహించాలని సూచించారు.

News November 6, 2025

HLL లైఫ్‌కేర్ లిమిటెడ్‌లో 354 పోస్టులు

image

<>HLL<<>> లైఫ్‌కేర్ లిమిటెడ్‌ 354 పోస్టులను భర్తీ చేస్తోంది. పోస్టును బట్టి డిప్లొమా, BSc, MSc(మెడికల్ డయాలిసిస్ టెక్నాలజీ), MBA(హెల్త్ కేర్), BE, బీటెక్ (బయోమెడికల్ ఇంజినీర్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అర్హులు. ఆసక్తిగల వారు ఈనెల 9 – 16 వరకు ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. స్కిల్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. hrwestrecruitment@lifecarehll.com ద్వారా ఈనెల 16లోగా అప్లై చేసుకోవాలి.

News November 6, 2025

ధాన్యం నిల్వలో తేమ శాతం ముఖ్యం

image

ధాన్యాన్ని నిల్వచేసేటప్పుడు తేమ 14% కన్నా ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. గింజలలో తేమ శాతం తక్కువగా ఉంటే ధాన్యం రంగు మారదు, బూజు పట్టదు, కీటకాలు ఆశించవు. ధాన్యంలో తేమ 14%కు మించినప్పుడు, నిల్వ చేసే పద్ధతి సరిగా లేనప్పుడు ధాన్యానికి కీటకాలు, తెగుళ్లు ఆశించి నష్టం జరుగుతుంది. అందుకే ధాన్యాన్ని ఎక్కువ కాలం నిల్వ చేసేప్పుడు మధ్యలో అప్పుడప్పుడు చీడపీడలను పరిశీలిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.