News March 16, 2024

షర్మిల ఏపీ సీఎం అయ్యే వరకు తోడుగా ఉంటా: సీఎం రేవంత్

image

కష్టాల్లో ఉన్న ఏపీ ప్రజలకు అండగా నిలవడానికే వైఎస్ షర్మిల ఇక్కడకు వచ్చారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘అచ్చోసిన ఆంబోతుల్లా వారిద్దరూ(చంద్రబాబు, జగన్) తలపడుతుంటే ఈ ప్రాంతంలో ఎన్నికల్లో నెగ్గడం ఆషామాషీ కాదని ఆమెకు తెలుసు. అయినా సరే పోరాటం చేయడానికి షర్మిల ముందుకొచ్చారు. ఆమె నాయకత్వాన్ని ప్రజలు బలపర్చాలి. ఆమె ఏపీ సీఎం పీఠంపై కూర్చునే వరకు నేను తోడుగా ఉంటా’ అని పేర్కొన్నారు.

Similar News

News November 5, 2024

నా వ్యాఖ్యలు బాధపెడితే క్షమించండి: కస్తూరి

image

తాను చేసిన <<14525601>>వివాదాస్పద<<>> వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తమిళ నటి కస్తూరి ప్రకటన విడుదల చేశారు. ‘రెండ్రోజులుగా నాకు బెదిరింపులు వస్తున్నాయి. నేను నిజమైన జాతీయవాదిని. కుల, ప్రాంతీయ భేదాలకు నేను అతీతం. తెలుగుతో ప్రత్యేక అనుబంధం ఉంది. నేను మాట్లాడింది నిర్దిష్ట వ్యక్తుల గురించి మాత్రమే. ఎవరినైనా బాధపెడితే క్షమించండి. నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా’ అని పేర్కొన్నారు.

News November 5, 2024

అక్టోబర్ మాసం: దేశంలో 4లక్షల కార్ల విక్రయం

image

అక్టోబర్‌లో కార్ల అమ్మకాలు జోరందుకున్నాయి. దసరా, దీపావళి పండుగలు ఉండటంతో ప్రజలు భారీగా ఫోర్ వీలర్స్ కొనుగోలు చేశారు. ఒక్క నెలలోనే దేశంలో 4,01,447 కార్ల అమ్మకం జరిగింది. వీటిలో మారుతీ సుజుకి అధికంగా 1,59,591 కార్లను విక్రయించింది. వీటి తర్వాత హుండాయ్(55,568), మహీంద్రా (54,504), టాటా మోటార్స్ (48,131), టయోటా (30,845), కియా మోటార్స్(28,545) ఉన్నాయి.

News November 5, 2024

బిర్యానీ తిని యువతి మృతి

image

TG: కొన్ని రోజుల క్రితం HYDలో మోమోస్ తిని ఓ మహిళ మరణించిన ఘటన మరవకముందే మరో విషాదం జరిగింది. నిర్మల్ జిల్లాలో బిర్యానీ తిని ఫుడ్ పాయిజన్‌తో యువతి మరణించింది. ఈ నెల 2న బోథ్‌కు చెందిన 15-20 మంది నిర్మల్‌లోని గ్రిల్ నైన్ రెస్టారెంట్‌లో చికెన్ మండీ బిర్యానీ తిన్నారు. ఆ వెంటనే వాంతులు చేసుకోవడంతో ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఇవాళ పూల్ కలి బైగా(19) మృతి చెందింది.