News December 31, 2024

న్యూఇయర్ విషెస్.. జాగ్రత్త సుమా: పోలీసులు

image

కొత్త ఏడాదిని ఆసరాగా చేసుకొని కేటుగాళ్లు రెచ్చిపోయే అవకాశం ఉందని రాచకొండ పోలీసులు హెచ్చరిస్తున్నారు. కొత్త సంవత్సర శుభాకాంక్షలు, డిస్కౌంట్ కూపన్లు, ఆఫర్ కూపన్లు, ఫ్రీ ఈవెంట్ పాస్‌లు, APK ఫైల్స్ వంటివి పంపి మీ సమాచారాన్ని హ్యాక్ చేసి బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. లింక్‌లు క్లిక్ చేయమని కోరే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఇలాంటి వాటిపై <>వెబ్‌సైట్‌లో<<>> ఫిర్యాదు చేయాలని తెలిపారు.

Similar News

News January 8, 2026

అమెరికా నియమాలను ఉల్లంఘిస్తోంది: ఫ్రాన్స్ అధ్యక్షుడు

image

అమెరికా విదేశాంగ విధానాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, జర్మనీ ప్రెసిడెంట్ ఫ్రాంక్ వాల్టర్ ఖండించారు. ‘US క్రమంగా దాని మిత్రదేశాల్లో కొన్నింటి నుంచి దూరం జరుగుతోంది. ఇంతకాలం అది ప్రోత్సహిస్తూ వచ్చిన అంతర్జాతీయ నియమాలను ఉల్లంఘిస్తోంది. కొత్త వలసవాదం, సామ్రాజ్యవాదాన్ని ఫ్రాన్స్ తిరస్కరిస్తుంది’ అని మేక్రాన్ చెప్పారు. ప్రపంచం దోపిడీదారుల డెన్‌లా మారే ప్రమాదం ఉందని ఫ్రాంక్ వాల్టర్ అన్నారు.

News January 8, 2026

అద్దె బస్సుల యజమానుల సమ్మె నోటీసులు!

image

AP: RTC అద్దె బస్సుల యజమానులు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి సమ్మె నోటీసులిచ్చారు. బస్సు అద్దె పెంచాలని అందులో డిమాండ్ చేశారు. లేకపోతే ఈ నెల 12 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. స్త్రీశక్తితో అధిక రద్దీ వల్ల భారం పడుతోందని, అదనంగా నెలకు రూ.15-20వేల వరకు ఇవ్వాలని కోరుతున్నారు. రాష్ట్రంలో 2,500 వరకు అద్దె బస్సులుండగా, సమ్మెకు దిగితే సంక్రాంతి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి.

News January 8, 2026

అమెరికా సీజ్ చేసిన ట్యాంకర్‌లో ముగ్గురు ఇండియన్లు!

image

రష్యా జెండాతో వెళ్తున్న క్రూడాయిల్ ట్యాంకర్‌ను అమెరికా నిన్న <<18791945>>స్వాధీనం<<>> చేసుకున్న విషయం తెలిసిందే. అందులోని 28 మంది సిబ్బందిలో ముగ్గురు ఇండియన్లు ఉన్నట్లు తెలుస్తోంది. 17మంది ఉక్రేనియన్లు, ఆరుగురు జార్జియా పౌరులు, ఇద్దరు రష్యన్లు ఉన్నట్లు సమాచారం. వీరందరినీ US నిర్బంధించింది. సిబ్బందితో మర్యాదగా ప్రవర్తించాలని, విదేశీయులను వీలైనంత త్వరగా విడుదల చేయాలని రష్యా డిమాండ్ చేసింది.