News March 16, 2024
ప్రణీత్‌రావుకు 7 రోజుల పోలీస్ కస్టడీ

TS: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును పోలీసుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. మార్చి 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విచారణలో భాగంగా ఎవరి ఆదేశాలతో ఫోన్లు ట్యాపింగ్ చేశారు? ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు? ఆధారాలు ఎందుకు ధ్వంసం చేశారనే వివరాలను పోలీసులు రాబట్టనున్నారు.
Similar News
News April 10, 2025
దేశ ఎగుమతుల్లో 6 శాతం వృద్ధి

దేశ ఎగుమతులు FY25లో $820బిలియన్లుగా నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. FY24($778 బిలియన్లు)తో పోలిస్తే 6 శాతం వృద్ధి సాధించినట్లు తెలిపింది. ఇందులో వస్తు ఎగుమతులు $395.63 బిలియన్లు, సేవల ఎగుమతులు $354.90 బిలియన్లుగా నమోదైనట్లు పేర్కొంది. ఎర్ర సముద్రంలో సంక్షోభం, రష్యా-ఉక్రెయిన్ వివాదం గల్ఫ్‌కు విస్తరించడంతో కొన్ని దేశాల్లో వృద్ధి నెమ్మదించినా భారత్ తన అంచనాలను అధిగమించినట్లు వివరించింది.
News April 10, 2025
దుమ్మురేపుతున్న గుజరాత్ టైటాన్స్!

గుజరాత్ టైటాన్స్ కోచింగ్‌లో పెద్దగా హడావిడి ఉండదు. యజమానులూ కనిపించరు. పేపర్‌పై చూస్తే 5 మ్యాచులు గెలిచినా గొప్పే అన్నట్లుండే ఈ జట్టు గ్రౌండ్లోకి వచ్చేసరికి అందరి అంచనాలను తలకిందులు చేస్తోంది. బట్లర్, గిల్, రషీద్, సిరాజ్ తప్పితే స్టార్లు లేని GT రూథర్‌ఫోర్డ్, సుదర్శన్, తెవాటియా వంటి బ్యాటర్లు, ప్రసిద్ధ్, ఇషాంత్, సాయి కిశోర్ వంటి బౌలర్లతోనే దుమ్మురేపుతోంది. ప్రస్తుతం టేబుల్ టాపర్‌గా ఉంది.
News April 10, 2025
నా తర్వాతి సినిమా ఇదే: రామ్‌గోపాల్ వర్మ

తన కెరీర్లో తొలిసారిగా హారర్ కామెడీ సినిమా చేస్తున్నట్లు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విటర్లో తెలిపారు. ‘‘ప్రజలకు భయమేస్తే పోలీసుల వద్దకు పరిగెడతారు. మరి పోలీసులే భయపడితే’ అన్న కాన్సెప్ట్‌తో హారర్ కామెడీ జానర్లో సినిమాను తీస్తున్నా. మనోజ్ బాజ్‌పాయ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘పోలీస్ స్టేషన్లో దెయ్యం’ అన్నది సినిమా టైటిల్. ‘చనిపోయిన వారిని చంపలేరు’ అన్నది ట్యాగ్‌లైన్’ అని RGV పేర్కొన్నారు.