News March 16, 2024
25 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలనివ్వండి: రేవంత్ రెడ్డి

APకి కావాల్సింది పాలకులు కాదని, ప్రశ్నించే గొంతుకలని TS CM రేవంత్ రెడ్డి అన్నారు. ‘వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించండి. మిమ్మల్ని ఎక్కువ అడగడం లేదు. 25 మంది MLAలు, ఐదుగురు MPలను ఇవ్వండి చాలు. షర్మిలమ్మ పోరాటం చేస్తారు. ఎవరినైనా చొక్కా పట్టి ప్రశ్నిస్తారు. ఎలా మీ రాజధాని నిర్మాణం కాదో, ఎలా పోలవరం పూర్తికాదో, ఎలా విశాఖ ఉక్కును కొల్లగొడతారో చూసుకుంటారు. కంచె వేసి కాపాడుకుంటారు’ అని అన్నారు.
Similar News
News August 27, 2025
వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మూసీ డెవలప్‌మెంట్: CM రేవంత్

TG: HYD నగరానికి వచ్చే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మూసీ నదీ పరివాహక ప్రాంత అభివృద్ధి జరగాలని అధికారులకు CM రేవంత్ చెప్పారు. గేట్ వే ఆఫ్ HYD, గాంధీ సరోవర్, జంక్షన్ల ఏర్పాటు, రోడ్ల అభివృద్ధిపై సూచనలు చేశారు. సిగ్నల్ రహిత జంక్షన్లను ఏర్పాటు చేయాలని, పర్యావరణ హితంగా ఉండేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. మీరాలం చెరువు, ఐకానిక్ బ్రిడ్జ్ ప్రాజెక్టుల DPR సిద్ధం చేసి పనులు మొదలెట్టాలని ఆదేశించారు.
News August 27, 2025
వీధి వ్యాపారులకు లోన్లు.. కేంద్రం గుడ్ న్యూస్!

PM స్వనిధి పథకం గడువును కేంద్రం 2030 మార్చి 31 వరకు పొడిగించింది. ఈ స్కీమ్ కింద వీధి వ్యాపారులకు పూచీకత్తు లేకుండా లోన్ ఇస్తారు. తొలి విడతలో ₹15 వేలు, అది చెల్లించాక రెండో విడతలో ₹25 వేలు, మూడో విడతలో ₹50,000 మంజూరు చేస్తారు. ఇప్పటివరకు తొలి విడతలో ₹10K, రెండో విడతలో ₹20K ఇచ్చేవారు. తాజాగా ఆ మొత్తాన్ని పెంచారు. లోన్ కోసం స్వనిధి పోర్టల్ లేదా కామన్ సర్వీస్ సెంటర్‌లో అప్లై చేయాలి.
News August 27, 2025
ఏపీకి NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థి

AP: మహారాష్ట్ర గవర్నర్, NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థి సి.పి. రాధాకృష్ణన్ శ్రీవారి దర్శనార్థం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు మంత్రి నారాయణ, టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు స్వాగతం పలికారు. మరోవైపు ఇండీ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి సీపీఐ, సీపీఎం పార్టీలు మద్దతు ప్రకటించాయి.