News December 31, 2024
వరుస విజయాలు.. ఏడాదంతా బీజేపీ పవనాలు
2024 రాజకీయంగా BJPకి కలిసొచ్చింది. LS ఎన్నికల్లో BJP బలం 240కి తగ్గి మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వచ్చినా HR, MH ఎన్నికలు విశ్వాసాన్ని నింపాయి. హరియాణాలో పోలరైజేషన్ వ్యూహాలు, MHలో ఏక్ హైతో సేఫ్ హై నినాదాలు బీజేపీని విజయతీరాలకు చేర్చాయి. JK, JHలలో పవర్ దక్కకున్నా పట్టునిలుపుకుంది. పాలనాపరంగా జమిలి ఎన్నికల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి 2029 ఎన్నికల అజెండాను అప్పుడే ఉనికిలోకి తెచ్చేసింది.
Similar News
News February 5, 2025
OTTలోకి మహేశ్ ‘ముఫాసా’.. ఎప్పుడంటే?
‘ది లయన్ కింగ్’ మూవీకి ప్రీక్వెల్‌గా వచ్చిన ‘ముఫాసా’కు థియేటర్లలో మంచి ఆదరణ లభించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్ర ఓటీటీ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈనెల 18వ తేదీ నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌లో వీడియో ఆన్ డిమాండ్ కింద స్ట్రీమింగ్ కానుంది. అంటే, డబ్బులు చెల్లించి ‘ముఫాసా’ను చూడొచ్చు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఫ్రీగా చూసేయొచ్చు. తెలుగులో ముఫాసాకు మహేశ్ వాయిస్ అందించారు.
News February 5, 2025
Breaking: తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు
ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ షాకిచ్చింది. కులగణన ఫామ్‌కు నిప్పుపెట్టడంపై వివరణ కోరుతూ పార్టీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. కులగణనను పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అలాంటిది ఆ ఫామ్‌కు నిప్పుపెట్టడంతో మంత్రి సీతక్క సహా పలువురు నేతలు ఆయన్ను తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే.
News February 5, 2025
తొలిసారి Girl Friend గురించి చెప్పిన బిల్‌గేట్స్
తనకు సరైన ప్రేయసి దొరికిందని, ఆమెతో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నానని మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్‌గేట్స్ అన్నారు. తామిద్దరం కలిసి ఒలింపిక్స్, అనంత్ అంబానీ పెళ్లి సహా ప్రపంచమంతా చుట్టేస్తున్నామని తెలిపారు. చాలా సరదాగా గడుపుతున్నామని వెల్లడించారు. ఒరాకిల్ మాజీ CEO మార్క్ హర్డ్ భార్య పౌలా హర్డే ఆయన ప్రేయసి. 2019లో భర్త చనిపోయాక ఆయన వద్దకు చేరారు. కొన్ని కారణాలతో గేట్స్‌తో మిలిండా విడాకులు తీసుకోవడం తెలిసిందే.