News December 31, 2024
లంచగొండి CBI అధికారి మెడల్ వెనక్కి తీసుకున్న కేంద్రం
అవినీతి అధికారులకు కేంద్రం గట్టి హెచ్చరికను పంపించింది. లంచం కేసులో అరెస్టైన CBI ఇన్‌స్పెక్టర్ రాజ్ మెడల్‌ను వెనక్కి తీసుకుంది. ఓ కేసు దర్యాప్తులో అద్భుత ప్రతిభ చూపడంతో 2023లో అతడికీ అవార్డు రావడం గమనార్హం. మధ్యప్రదేశ్ నర్సింగ్ కాలేజీలో అవినీతి, అక్రమాల కేసులో కొన్ని నెలల కిందట రూ.10లక్షల లంచం తీసుకుంటూ ఆయన రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 5, 2025
ఫస్ట్ INGలోనే అసౌకర్యంగా అనిపించింది: బుమ్రా
ఐదో మ్యాచ్ ఫలితం తనను నిరాశకు గురి చేసిందని భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అన్నారు. కీలక సమయంలో బౌలింగ్ చేయలేకపోయినందుకు ఇంకాస్త బాధగా ఉందని చెప్పారు. మనం శరీరానికి గౌరవం ఇవ్వాలని, దాంతో పోరాడలేం అని చెప్పారు. శరీరం బాగుంటేనే ఏదైనా చేయగలుగుతామన్నారు. తొలి ఇన్నింగ్స్ ఆడుతున్నప్పుడే వెన్నునొప్పితో అసౌకర్యంగా అనిపించిందని, దానిపై మెడికల్ టీంతో చర్చించి స్కానింగ్‌కు వెళ్లినట్లు చెప్పారు.
News January 5, 2025
SHOCKING: పెళ్లికాని జంటలకు ఓయోలో నో రూమ్స్
హోటల్ బుకింగ్ సంస్థ ఓయో నూతన చెక్ ఇన్ పాలసీని తీసుకొచ్చింది. దీని ప్రకారం పెళ్లి కాని జంటలు రూమ్‌ను బుక్ చేసుకునే అవకాశం ఉండదు. ఈ నిబంధనలను తొలుత UP మీరట్‌లో అమలుచేస్తోంది. ఆ తర్వాత దేశమంతా విస్తరించే అవకాశం ఉంది. ఇకపై రూమ్ బుకింగ్ సమయంలో జంటలు తమ పెళ్లిని నిర్ధారించే IDని సమర్పించాలి. సురక్షితమైన, బాధ్యతాయుతమైన హాస్పిటాలిటీకి తాము కట్టుబడి ఉన్నామని ఓయో నార్త్ ఇండియా హెడ్ పవాస్ శర్మ తెలిపారు.
News January 5, 2025
దేవాలయాలపై దాడులు పెరిగాయి: పురందీశ్వరి
AP: దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని రాష్ట్ర BJP చీఫ్, MP పురందీశ్వరి అన్నారు. ఆలయాలకు రక్షణ కల్పించాలని, హిందూ ధర్మం సంప్రదాయాలను కాపాడాలని కోరారు. ధార్మిక క్షేత్రాల్లో అన్యమతస్థులు పెరిగారని, నియంత్రించాలన్నారు. దేవాలయాలపై దాడులు పెరిగాయని హైందవ శంఖారావంలో చెప్పారు. ఆలయాలకు స్వయం ప్రతిపత్తి వచ్చే వరకు పోరాడతామని, మతాన్ని రాజకీయం చేశారని VHP నేత, సభ అధ్యక్షుడు గోకరాజు గంగరాజు అన్నారు.