News March 16, 2024

అమలాపురంలో మళ్లీ మొసలి ప్రత్యక్షం

image

అమలాపురం రూరల్ ఈదరపల్లి గ్రామ పంచాయితీ కార్యాలయం ఎదురుగా ఉన్న ప్రధాన కాలువలో శనివారం మొసలి ప్రత్యక్షం అయింది. మొసలిని చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాలువను ఆనుకునే గృహాలు ఉండటంతో చుట్టుపక్కల వారంతా ఆందోళన చెందుతున్నారు. కొన్ని నెలల క్రితం ఈ ప్రాంతానికి దగ్గరలోనే అధికారులు మొసలిని పట్టుకున్నారు. ఇప్పుడు మరో మొసలి ప్రత్యక్షమైంది.

Similar News

News July 10, 2025

‘కడియం నర్సరీ అందాలు అద్భుతంగా ఉన్నాయి’

image

మహారాష్ట్రకు చెందిన కేంద్ర రైల్వే మాజీ మంత్రి, సీనియర్ బీజేపీ నేత శ్రీరామ్ సాహెబ్ దాన్వే బుధవారం కడియం మండలం కడియపులంకలోని శ్రీ సత్య దేవ నర్సరీని సందర్శించారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి నర్సరీకి విచ్చేసి పలు రకాల మొక్కలను పరిశీలించారు. వాటి ప్రత్యేకతలను అడిగి తెలుసుకున్నారు. కడియం నర్సరీ అందాలు అద్భుతంగా ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు.

News July 10, 2025

నేడు మెగా పేరెంట్, టీచర్ మీట్

image

గోపాలపురం మండలంలో నేడు మెగా పేరెంట్, టీచర్ మీట్ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. రాజంపాలెం, కొవ్వూరుపాడు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ సమావేశం జరుగుతుందని, ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి, ప్రజాప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు తమ సమస్యలను, సలహాలను ఈ మీట్‌లో పంచుకోవచ్చని అధికారులు సూచించారు.

News July 10, 2025

ఆమరణ నిరాహార దీక్ష చేస్తా: జక్కంపూడి

image

కాకినాడ పేపర్ మిల్లు కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 14వ తేదీ నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా బుధవారం ప్రకటించారు. పేపర్ మిల్లు యాజమాన్యం కార్మికులకు సుమారు రూ.50 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందని ఆయన అన్నారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కార్మికుడు సంగీతం సత్యనారాయణ కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని రాజా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.