News December 31, 2024

కరోనా వైరస్ తొలికేసుకు ఐదేళ్లు

image

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి తొలి కేసును ఇదేరోజున 2019లో చైనాలోని వుహాన్‌లో గుర్తించారు. జనవరి తొలి వారంలో దీనిని నావెల్ కరోనా వైరస్‌గా ప్రకటించారు. 2020 మార్చి నాటికి ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు వ్యాపించింది. ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఈ వైరస్ లక్షల మంది ప్రాణాలు తీసుకోవడంతో పాటు వేలాది మందిని అనాథలుగా మార్చేసింది.

Similar News

News January 5, 2025

నేను ఎంత సున్నితమో.. అంత కఠినం కూడా: సీత‌క్క‌

image

‘నేను ఎంత సున్నితమో, అంతే కఠినంగా కూడా ఉంటా’ అని మంత్రి సీత‌క్క వ్యాఖ్యానించారు. ఆదివారం HYDలో DPOలతో స‌మావేశ‌మైన ఆమె గ్రామీణ ప్రాంతాల స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై దిశానిర్దేశం చేశారు. స్థానిక పరిస్థితులను బట్టి ప్రణాళికలు రూపొందించి ఆచరణలో పెట్టాలని ఆదేశించారు. తప్పులను సరిదిద్దుకొని విధుల్లో వేగం పెంచాలని సూచించారు. PR శాఖను ఫ్యామిలీగా భావిస్తానని, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

News January 5, 2025

త్రివిక్రమ్‌పై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు: పూనమ్ కౌర్

image

డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై హీరోయిన్ పూనమ్ కౌర్ మరోసారి విమర్శలు గుప్పించారు. ‘త్రివిక్రమ్‌పై చాలాకాలం కిందట MAAలో ఫిర్యాదుచేశా. అయినా అతడిని ప్రశ్నించలేదు.. చర్యలు తీసుకోలేదు. నా ఆరోగ్యం, సంతోషాన్ని నాశనం చేసిన అతడిని పెద్ద తలకాయలు కాపాడుతున్నాయి’ అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. త్రివిక్రమ్ తనతోపాటు ఎంతో మంది జీవితాలను నాశనం చేశాడని ఆమె పలుమార్లు ఆరోపించిన విషయం తెలిసిందే.

News January 5, 2025

వందల ఏళ్ల సంప్రదాయం.. ఆదివారం ఆ ఊరిలో మాంసం తినరు

image

AP: ఆదివారం వచ్చిందంటే చాలా ఇళ్లలో మాంసాహారం తప్పనిసరి. కానీ నంద్యాల(D) ఎస్.కొత్తూరులో మాత్రం వందల ఏళ్లుగా సండే ఎవరూ మాంసం తినరు. మద్యం తాగరు. గ్రామంలో ఎవరైనా ఆదివారం మరణించినా అంత్యక్రియలు మరుసటి రోజు నిర్వహిస్తారు. 400 ఏళ్ల కిందట ఓ పొలంలో దొరికిన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహంతో ఆలయం నిర్మించారని, ఆ స్వామికి ఆదివారం ప్రీతికరమైన రోజని గ్రామస్థుల భావన. అందుకే భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు.