News December 31, 2024

రోడ్డుపై కేకు కట్ చేస్తే అంతే..!

image

న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతోన్న వారికి తెలంగాణ పోలీసులు షాక్ ఇచ్చారు. రోడ్లపై కేకులు కట్ చేయడాన్ని నిషేధిస్తున్నట్లు ట్విటర్ ద్వారా ప్రకటించారు. వేడుకల్లో చేయకూడని పనులపై అవగాహన కల్పించారు. ‘మద్యం తాగి వాహనాలు నడపకూడదు. రోడ్లపై మద్యం తాగటం, కేక్ కటింగ్ లాంటివి చేయకూడదు. డీజేలు పెట్టొద్దు. టపాసులు కాల్చొద్దు. డ్రగ్స్ తీసుకున్నా, డ్రగ్స్ ఉన్న పార్టీలలో పాల్గొన్నా ఇబ్బందులు తప్పవు’ అని హెచ్చరించారు.

Similar News

News January 12, 2026

కేంద్ర బడ్జెట్.. దేశ చరిత్రలో తొలిసారి..

image

ఫిబ్రవరి 1 ఆదివారం అయినప్పటికీ అదే రోజు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధికారికంగా ప్రకటించారు. ఇలా ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టడం దేశ చరిత్రలో తొలిసారి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు.

News January 12, 2026

పండగకు ఏ చీర కొంటున్నారు?

image

పండుగ సమయంలో మంగళగిరి పట్టు చీర ధరిస్తే హుందాగా ఉంటుంది. ఇవి తక్కువ ధరల్లో ఫ్యాన్సీ రకాల్లో మార్కెట్లో లభిస్తాయి. యువతులకైనా, మధ్యవయస్కులకైనా ఇవి సూపర్‌గా ఉంటాయి. పైథానీ పట్టు చీర మెరుస్తూ మంచి లుక్‌ ఇస్తుంది. గద్వాల్ చీరలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. పట్టులో కాకుండా ఫ్యాన్సీలో ట్రెండీగా కనిపించాలనుకుంటే ప్రింట్ చీరలు తీసుకోవచ్చు. ఏవి కట్టుకున్నా దాన్ని హుందాగా క్యారీ చేస్తే అందరి దృష్టీ మీ పైనే..

News January 12, 2026

ఇక డాక్టర్ చదువులు అక్కర్లేదట.. ఎందుకో చెప్పిన మస్క్!

image

ఎంతో కష్టపడి చదివి మనిషి ప్రాణాలను నిలబెట్టే డాక్టర్ కోర్సులు ఇక అవసరం లేదట. వైద్య విద్యలన్నీ ఉపయోగం లేకుండా పోతాయట. ప్రపంచ కుబేరుడు మస్క్ అంచనాలివి. AIలో వస్తున్న మార్పులతో భవిష్యత్తులో రోబోలే క్లిష్టమైన సర్జరీలూ చేస్తాయని చెప్పారు. సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చెందుతున్నా కొద్దీ ఆరోగ్య సంరక్షణ సేవలూ మెరుగవుతాయని తెలిపారు. ఒక దేశాధ్యక్షుడికి అందే వైద్య సౌకర్యాలు సామాన్యుడికీ అందుబాటులోకి వస్తాయన్నారు.