News March 16, 2024
రూ.50 వేలకు మించి నగదుతో ప్రయాణించవద్దు: ఎస్పీ

ఎన్నికల దృష్ట్యా ప్రజలు ఆధారాలు లేకుండా రూ.50 వేలకు మించి నగదుతో ప్రయాణించవద్దని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. సిరిసిల్ల జిల్లాలో 7 చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని, ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతిరోజు తనిఖీలలో జప్తు చేసిన సొమ్మును జిల్లాలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కమిటీకి అప్పగిస్తామన్నారు. ఆధారాలు ఇస్తే గ్రీవెన్స్ కమిటీ నగదు విడుదల చేస్తుందన్నారు.
Similar News
News September 4, 2025
నిమజ్జనోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కేంద్రమంత్రి

KNRలో రేపు జరిగే వినాయక నిమజ్జనోత్సవానికి సంబంధించి ఏర్పాట్లను కేంద్రమంత్రి బండి సంజయ్ పరిశీలించారు. ఇందులో భాగంగా మానకొండూరు చెరువును, చింతకుంట చెరువును సందర్శించి నిమజ్జన ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను జిల్లా అధికారులను అడిగి తెలుసుకొన్నారు. గణేష్ విగ్రహాల తరలింపు సమయంలో కరెంటు తీగలు, చెట్లు అడ్డు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. గతంలో కన్నా ఎక్కువ సంఖ్యలో క్రేన్లు ఏర్పాటు చేయాలన్నారు.
News September 4, 2025
KNR: గణపతి నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు: సీపీ

కరీంనగర్‌లో వినాయక నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. నిమజ్జన ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. శోభాయాత్ర మార్గాలలో బందోబస్తు, రూఫ్ టాప్, పుషింగ్ పార్టీ, స్టార్టింగ్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పటిష్ట బందోబస్తుతో నిమజ్జనం విజయవంతం చేయాలన్నారు.
News September 4, 2025
KNR: ఈ నెల 6న గ్రాండ్ మాస్టర్ చెస్ క్యాంపు

KNR నగరంలోని భగత్ నగర్ లో విశ్వనాథ్ చెస్ అకాడమీలో ఈ నెల 6న గ్రాండ్ మాస్టర్ చెస్ కోచింగ్ క్యాంపును ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు, అకాడమీ డైరెక్టర్ విశ్వనాథ్ ప్రసాద్, జిల్లా చెస్ అసోసియేషన్ కో-ఆర్డినేటర్ రాజేంద్రప్రసాద్, అకాడమీ సీనియర్ కోచ్ శివయ్య తెలిపారు. ఈ క్యాంపునకు ప్రముఖ ఇండియన్ గ్రాండ్ మాస్టర్ లలిత్ బాబు హాజరవుతున్నారని పేర్కొన్నారు. వివరాలకు 7569229294, 9030177607 సంప్రదించాలన్నారు.