News December 31, 2024
SVU: ‘మెడికల్ దందాపై విచారణ జరపాలి’
SVU హెల్త్ సెంటర్ నందు గత ప్రభుత్వ హయాంలో అనేక మెడికల్ దందాలు జరిగాయని TNSF రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆర్కే నాయుడు, రాష్ట్ర నాయకులు చిన్న, AISF యూనివర్సిటీ అధ్యక్షులు రంజిత్ ఆరోపించారు. విద్యార్థులు ఏ అనారోగ్య సమస్యతో వెళ్లిన ఒకే రకమైన మందులు ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం రిజిస్ట్రార్ భూపతి నాయుడుకి వినతి పత్రం అందజేశారు. సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
Similar News
News January 5, 2025
చిత్తూరు: రేపు PGRS రద్దు
జిల్లాలో ఈనెల 6 న సోమవారం జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఈ నెల 6,7 వ తేదీలలో సీఎం చంద్రబాబు పర్యటనలో అధికారులందరూ నిమగ్నమై ఉన్నందున రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ఈ విషయం జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.
News January 5, 2025
వరదయ్యపాలెం: కరెంట్ బిల్లు రూ.47 వేలు
వరదయ్యపాలెం మండలం కోవూరుపాడుకు చెందిన మారెయ్య తన ఇంటికి వచ్చిన కరెంటు బిల్లు చూసి కంగుతిన్నాడు. జనవరి నెలలో కరెంట్ బిల్లు రూ.47,932 రావడంతో నోరు వెల్లబెట్టాడు. గత నెలలో రూ. 830 బిల్లు వచ్చినట్లు తెలిపారు. ప్రతినెలా క్రమం తప్పకుండా బిల్లు చెల్లిస్తున్నట్లు చెప్పారు. దీంతో బాధితుడు వరదయ్యపాలెం విద్యుత్ శాఖ కార్యాలయ అధికారులను ఆశ్రయించాడు.
News January 5, 2025
కుప్పం: రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య
చెన్నై-బెంగళూరు రైల్వే మార్గంలోని కుప్పం మండలం గుల్లెపల్లి సమీపంలో శనివారం గుర్తు తెలియని యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి వివరాలు ఎవరికైనా తెలిస్తే కుప్పం రైల్వే పోలీసులను సంప్రదించాలని పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించారు.