News December 31, 2024

నిఘా నీడలో విశాఖ..!

image

ఆంగ్ల నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో విశాఖ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు గీత దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రధానంగా రద్దీగల ప్రాంతాలతో పాటు తెలుగు తల్లి ఫ్లైఓవర్, అడవివరం, బీఆర్డీఎస్ రోడ్డుతో పాటు ఇతర ప్రాంతాలలో నిఘా పెంచారు. వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బలగాలను పహారా పెట్టారు.

Similar News

News September 15, 2025

విశాఖలో 15 హోటల్స్‌పై క్రిమినల్ కేసులు

image

గత నెల ఒకటి రెండు తేదీల్లో ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో జరిగిన దాడుల్లో 81 హోటల్స్‌లో శాంపిల్స్ సేకరించి ఫుడ్ ల్యాబరేటరీకి పంపించారు. వీటి ఫలితాలు రావడంతో 15 హోటల్స్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నామని మరో 14 హోటల్స్‌పై జేసి కోర్టులో జరిమానా విధిస్తున్నట్లు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కళ్యాణ్ చక్రవర్తి ఓ ప్రకటనలో తెలిపారు. హోటల్స్ యజమానులు ఫుడ్ సేఫ్టీ ప్రకారం నాణ్యత పాటించాలన్నారు.

News September 15, 2025

విశాఖలో ఆరుగురు సీఐలు బదిలీ

image

విశాఖ సిటీలో ఆరుగురు సీఐలను బదిలీ చేస్తూ CP శంఖబ్రత బాగ్చీ ఉత్తర్వులు జారీ చేశారు. MVP సీఐ మురళి, వెస్ట్ జోన్ క్రైమ్ సీఐ శ్రీనివాసరావును రేంజ్‌కు సరెండర్ చేశారు. ద్వారక సర్కిల్ ట్రాఫిక్ CI కేఎన్వి ప్రసాద్‌ను ఎంవీపీకి, పోలీస్‌కంట్రోల్ రూమ్ సీఐ ఎన్.విప్రభాకర్‌ను ద్వారకా ట్రాఫిక్‌కి బదిలీ చేశారు. సిటీ వీఆర్ సీఐ చంద్రమౌళిని వెస్ట్ జోన్ క్రైమ్‌కు. సిటీ విఆర్ భాస్కరరావును కంట్రోల్ రూమ్‌కు బదిలీ చేశారు.

News September 15, 2025

విశాఖలో ‘స్వస్త్ నారి-సశక్త్ పరివార్’ అభియాన్

image

విశాఖ జిల్లాలో మహిళల ఆరోగ్యం కోసం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు “స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్” ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ జగదీశ్వరరావు తెలిపారు. ఆరోగ్య కేంద్రాల్లో గుండెజబ్బులు, మధుమేహం, క్యాన్సర్, గర్భిణుల పరీక్షలు, పిల్లలకు టీకాలు వేస్తారన్నారు. సెప్టెంబర్ 17న ప్రధాని వర్చువల్‌గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.