News December 31, 2024
బాలయ్య షోలో ప్రభాస్‌తో కాల్ మాట్లాడిన చరణ్!

‘అన్‌స్టాపబుల్’ షోకు రామ్ చరణ్ గెస్టుగా వచ్చిన విషయం తెలిసిందే. ఈ షోలో తన ఫ్రెండ్, హీరో ప్రభాస్‌తో చరణ్ కాల్ మాట్లాడినట్లు సమాచారం. చెర్రీ గురించి తెలియని విషయాలను బాలయ్య అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ ఈ షోకు ప్రభాస్ రాగా చరణ్‌కు కాల్ చేసి డార్లింగ్‌తో బాలయ్య ఆడుకున్నారు. దీంతో ‘నువ్వు షోకు వచ్చినప్పుడు చెప్తా’ అంటూ ప్రభాస్ చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు.
Similar News
News November 6, 2025
రెండో రోజూ ఏసీబీ సోదాలు

AP: రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజూ ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 12 కార్యాలయాల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. డబుల్ రిజిస్ట్రేషన్లు, డాక్యుమెంట్ల ట్యాంపర్‌లో ప్రైవేటు వ్యక్తుల పాత్ర ఉందని తెలుస్తోంది. లెక్కల్లో చూపని నగదును పెద్దమొత్తంలో అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
News November 6, 2025
రూ.5వేల కోట్లు ఇచ్చేవరకు కాలేజీల బంద్: ఫతి

TG: రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఫార్మసీ తదితర ప్రొఫెషనల్ కాలేజీలు మూతబడి 4 రోజులు అవుతోంది. రూ.10వేల కోట్ల రీయింబర్స్‌మెంట్ బకాయిల్లో రూ.5వేల కోట్లు విడుదల చేసే వరకు బంద్ కొనసాగుతుందని ‘ఫతి’ స్పష్టం చేసింది. మిగతా రూ.5వేల కోట్లలో నెలకు రూ.500 కోట్ల చొప్పున 10 నెలల్లో విడుదల చేయాలంది. అధ్యాపకులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నామని.. అందుకే బంద్‌కు దిగాల్సి వచ్చిందని పేర్కొంది.
News November 6, 2025
ఏ దిక్కున కూర్చొని భోజనం చేయాలి ?

ఆయుష్షు కోరుకునేవారు తూర్పు ముఖంగా, కీర్తి, పేరు ప్రఖ్యాతలు కోరుకునేవారు దక్షిణ ముఖంగా కూర్చుని భోజనం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. తూర్పు దిశ నుంచి ప్రాణ, సానుకూల శక్తి వస్తుంది. ఈ శక్తి భోజనం చేసేటప్పుడు శరీరంలోకి ప్రవహించి, జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఆహారం ఆయురారోగ్యాలను ఇవ్వడానికి, ఉత్తమ ఫలితాలను పొందడానికి ఈ నియమాలు పాటించాలి. భోజనం చేసేటప్పుడు పద్మాసనంలో కూర్చోవడం, మౌనం పాటించడం మంచిది.


