News January 1, 2025

సింహాచలంలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నానికి ఏర్పాట్లు 

image

జనవరి 10న సింహాచలంలో జరగబోయే వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లలను ఈఓ త్రినాథరావు మంగళవారం పర్యవేక్షించారు. ఆరోజు పెద్దఎత్తున్న భక్తులు రావడంతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలనీ ఆదేశించారు. వైదిక కార్యక్రమాలు, విద్యుత్ దీపాలంకరణ, భక్తులకు మంచినీటి సరఫరా, సీసీ కెమెరాలు ఏర్పాటు, బార్కేడింగ్, క్యూలైన్లు ఏర్పాటు పనులను పర్యవేక్షించారు. ట్రాఫిక్ నియంత్రణకు అధికారులకు సూచనలు చేశారు.

Similar News

News November 9, 2025

విశాఖ కలెక్టరేట్‌లో రేపు జరగబోయే PGRS రద్దు

image

విశాఖ కలెక్టరేట్‌లో రేపు జరగబోయే పీజీఆర్ఎస్‌ను రద్దు చేసినట్లు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. జిల్లా అధికార యంత్రాంగం CII పార్ట్‌నర్ షిప్ సమ్మిట్ ఏర్పాట్లలో ఉన్నందున PGRSను తాత్కాలికంగా రద్దు చేశామన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ కోరారు. నవంబర్ 17వ తేదీన PGRS యథావిధిగా నిర్వహిస్తామని చెప్పారు.

News November 9, 2025

భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

image

ఈనెల 14,15వ తేదీల్లో జ‌ర‌గ‌నున్న ప్ర‌పంచస్థాయి భాగ‌స్వామ్య స‌ద‌స్సు ఏర్పాట్లను క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ ఆదివారం పరిశీలించారు. ఏయూ ఇంజినీరింగ్ క‌ళాశాల‌ మైదానంలో జ‌రుగుతున్న ఏర్పాట్ల‌ను జేసీ మ‌యూర్ అశోక్‌తో క‌లిసి ప‌రిశీలించి పలు సూచ‌న‌లు చేశారు. ప్ర‌తిష్ఠాత్మ‌క కార్య‌క్ర‌మానికి దేశ, విదేశాల నుంచి ప్రముఖులు హాజ‌ర‌వుతార‌న్నారు. ఎలాంటి సమస్యలు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.

News November 9, 2025

మల్కాపురంలో యువకుడి మృతి

image

మల్కాపురంలోని ఓ బార్‌లో పనిచేసే యువకుడు శనివారం అర్ధరాత్రి ఆకస్మికంగా మృతి చెందాడు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం విజయరాంపురం గ్రామానికి చెందిన గణపతి మల్కాపురంలోని బార్‌లో పనిచేస్తున్నాడు. మద్యానికి బానిస కావడంతో అనారోగ్యానికి గురయ్యాడు. శనివారం అర్ధరాత్రి బార్‌ వద్ద మృతి చెందినట్లు స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.