News January 1, 2025
జాగ్రత్త పడుతున్న మందుబాబులు
ప్రధాన నగరాల్లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌లు నిర్వహిస్తుండటంతో మందుబాబులు అలెర్ట్ అయ్యారు. వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకుని ఏయే రూట్లలో పోలీసులు లేరో, చెకప్స్ లేవో సమాచారం ఒకరికొకరు అందించుకుని మరీ తప్పించుకునేందుకు ప్లాన్స్ వేసుకుంటున్నారు. కాగా.. హైదరాబాద్‌లో ఫ్లై ఓవర్లను మూసేసి మరీ పోలీసులు మందుబాబుల కోసం చూస్తున్నారు. దొరికినవారికి 10వేల జరిమానా, 6 నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
Similar News
News January 5, 2025
నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు: హీరోయిన్
తనను ఓ బిజినెస్‌మెన్ వెంబడిస్తూ, లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని మలయాళ హీరోయిన్ హనీ రోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘గతంలో ఓ వ్యక్తి నిర్వహించిన ఈవెంట్‌కు నేను హాజరయ్యా. అప్పటినుంచి అతడు వెంటపడుతూ, సోషల్ మీడియాలోనూ నా పరువుకు భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నాడు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రత్యక్షమవుతున్నాడు’ అని ఆమె పేర్కొన్నారు. అతడిపై చట్టపరంగా పోరాడుతా అని తెలిపారు.
News January 5, 2025
తెలుగు వాళ్లు దేశ రాజకీయాలను ఏలలేకపోతున్నారు: సీఎం
TG: నేడు జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర సన్నగిల్లిందని CM రేవంత్ అన్నారు. దేశంలో అత్యధికంగా మాట్లాడే రెండో భాష తెలుగు అని, మన సినీ పరిశ్రమ ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి చేరిందని చెప్పారు. ఇంత ప్రభావం ఉన్నా మనం దేశ రాజకీయాలను ఏలలేకపోతున్నామని వ్యాఖ్యానించారు. NTR, PV, వెంకయ్య జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారని తెలిపారు. HYDలో జరుగుతున్న తెలుగు సమాఖ్య మహాసభల్లో సీఎం మాట్లాడారు.
News January 5, 2025
సాగు చేస్తున్న భూమికే రైతు భరోసా: భట్టి
TG: సాగు చేస్తున్న భూమికే రైతు భరోసా ఇస్తామని Dy.CM భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈనెల 26 నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు. వరంగల్(D) మొగిలిచర్ల సభలో ఆయన మాట్లాడారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి గత ప్రభుత్వం మోసం చేసిందని, పదేళ్లపాటు గ్రూప్-1 పరీక్ష నిర్వహించలేదని విమర్శించారు. రూ.2లక్షల లోపు రుణాలన్నీ మాఫీ చేశామని, సాంకేతిక కారణాలతో మాఫీ కాని వారికి త్వరలోనే పూర్తి చేస్తామన్నారు.