News January 1, 2025

హరిహర వీరమల్లు అప్‌డేట్ వచ్చేసింది!

image

న్యూ ఇయర్ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు ‘హరిహర వీరమల్లు’ టీమ్ అదిరే అప్‌డేట్ ఇచ్చింది. ఈ నెల 6న ఉదయం 9.06 గంటలకు తొలి పాట ‘మాట వినాలి’ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దీన్ని స్వయంగా పవన్ కళ్యాణే పాడటం విశేషం. తొలిభాగానికి పార్ట్-1 స్వోర్డ్ వెర్సస్ స్పిరిట్ అన్న ట్యాగ్‌లైన్ ఇచ్చారు. కీరవాణి సంగీతాన్నందిస్తున్న ఈ మూవీని జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్నారు.

Similar News

News January 5, 2025

WTC 2025-27లో భారత షెడ్యూల్ ఇదే

image

ఆస్ట్రేలియా చేతిలో 3-1 తేడాతో BGT సిరీస్ ఓడిన టీమ్ ఇండియా తర్వాతి టెస్ట్ మ్యాచును ఈ ఏడాది జూన్‌లో ఆడనుంది. WTC 2025-27లో భాగంగా జూన్-ఆగస్టు మధ్య ఇంగ్లండ్‌తో 5 టెస్టులు, అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో 2, నవంబర్, డిసెంబర్ నెలల్లో సౌతాఫ్రికాతో 2, 2026 ఆగస్టులో శ్రీలంకతో 2, 2026 అక్టోబర్‌, నవంబర్‌లో NZతో 2, 2027 జనవరి, ఫిబ్రవరిలో AUSతో 5 టెస్టులు (BGT సిరీస్) ఆడనుంది.

News January 5, 2025

రాజీవ్ బాటను చంద్రబాబు, YS కొనసాగించారు: రేవంత్

image

దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ దేశానికి ఐటీని పరిచయం చేశారని CM రేవంత్ అన్నారు. రాజీవ్ వేసిన బాటను చంద్రబాబు, YS కొనసాగించారని తెలిపారు. ఐటీ, ఫార్మాలో తెలుగువారి గొప్పతనం ప్రపంచానికి తెలిసిందన్నారు. చంద్రబాబు ఐటీకి పెద్దపీట వేసి సైబరాబాద్ నిర్మిస్తే, వైఎస్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం విమానాశ్రయం సమీపంలో ఫోర్త్ సిటీ నిర్మిస్తుందని తెలుగు సమాఖ్య మహాసభల్లో వివరించారు.

News January 5, 2025

నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు: హీరోయిన్

image

తనను ఓ బిజినెస్‌మెన్ వెంబడిస్తూ, లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని మలయాళ హీరోయిన్ హనీ రోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘గతంలో ఓ వ్యక్తి నిర్వహించిన ఈవెంట్‌కు నేను హాజరయ్యా. అప్పటినుంచి అతడు వెంటపడుతూ, సోషల్ మీడియాలోనూ నా పరువుకు భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నాడు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రత్యక్షమవుతున్నాడు’ అని ఆమె పేర్కొన్నారు. అతడిపై చట్టపరంగా పోరాడుతా అని తెలిపారు.