News January 1, 2025

గర్భిణులకు పోషకాహారాన్ని అందించాలి: కలెక్టర్

image

100 శాతం గర్భిణులకు అనుబంధ పోషకాహారాన్ని అందించాలని కలెక్టర్ పీ.రంజిత్ బాషా ఐసీడీఎస్ పీడీని ఆదేశించారు. మంగళవారం కర్నూలు కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో వివిధ అంశాలపై మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులతో ఆ శాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. బాల్యవివాహాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Similar News

News February 5, 2025

కర్నూలు APSP బెటాలియన్ కమాండెంట్‌గా దీపిక బాధ్యతల స్వీకరణ

image

కర్నూలు ఏపీఎస్పీ 2వ బెటాలియన్ కమాండెంట్‌గా దీపిక పాటిల్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పోలీసుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని వెల్లడించారు. ముందుగా బెటాలియన్ అధికారుల నుంచి ఆమె గౌరవ వందనం స్వీకరించారు. అడిషనల్ కమాండెంట్ మెహబూబ్ బాషా, తదితరులు పాల్గొన్నారు.

News February 5, 2025

కుటుంబానికి 100 రోజులు పని కల్పించాలి: కలెక్టర్

image

ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి రోజూ లక్ష మందికి ఉపాధి పనులు కల్పించాలని ఏపీడీ, ఎంపీడీవో, ఏపీవోలను కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు.ఉపాధి హామీ పనుల పురోగతి అంశంపై ఏపీడీలు, ఎంపీడీవోలు, ఏపీవోలతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా బుధవారం సమీక్ష నిర్వహించారు. పనుల కల్పనలో వెనుకబడిన అధికారులతో మాట్లాడారు. కుటుంబానికి 100 రోజుల పని కల్పించాలన్నారు.

News February 5, 2025

పారా అథ్లెటిక్స్‌లో ఎమ్మిగనూరు డిగ్రీ విద్యార్థి ఘనత

image

గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈనెల 2న జరిగిన 7వ రాష్ట్రస్థాయి పారా అథ్లెటిక్స్‌లో ఎమ్మిగనూరు శ్రీ మహాయోగి లక్ష్మమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి పింజారి బషీర్ సత్తా చాటాడు. 100 మీటర్లు, 1,500 మీటర్ల పరుగు పందెంలో మొదటి స్థానం సాధించాడు. ఈ విజయంతో కళాశాలకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు వచ్చిందని కళాశాల అధ్యక్షుడు డా.మహబూబ్ బాషా పేర్కొన్నారు. బషీర్‌ను కళాశాల అధ్యాపక సిబ్బంది అభినందించారు.

error: Content is protected !!